NTV Telugu Site icon

TG Govt: మూసీ పరిసరాల్లో నిర్మాణాల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు..

Musi River

Musi River

మూసీ పరిసరాల్లో నిర్మాణాలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పురపాలక శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం.. మూసీ నది పరిసరాల్లో నిర్మాణ అనుమతులపై కఠిన నియంత్రణలు అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి నాలుగు మంది సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మూసీకి 50 మీటర్ల పరిధిలో బఫర్ జోన్‌ కల్పించి, ఆ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. అలాగే, 50 నుంచి 100 మీటర్ల మధ్య ప్రాంతంలో కొత్తగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని పేర్కొంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ద్వారా ఈ మార్గదర్శకాలను అధికారికంగా అమలు చేయనుంది.

READ MORE: Lava Bold 5G: బడ్జెట్ ధరలో.. లావా కొత్త 5G స్మార్ట్‌ఫోన్ విడుదల..

ఈ కమిటీలో మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండి), డీటీసీపీ డైరెక్టర్, జీహెచ్‌ఎంసీ చీఫ్ ప్లానర్, హెచ్‌ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. మూసీ పరిసరాల్లో అభివృద్ధి పనులు, నీటి కాలుష్య నియంత్రణ, వరద నివారణ చర్యలపై ఈ కమిటీ సమీక్ష నిర్వహించి సిఫారసులు అందించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మూసీ పరిరక్షణకు ఎంతగానో దోహదపడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

READ MORE: Lava Bold 5G: బడ్జెట్ ధరలో.. లావా కొత్త 5G స్మార్ట్‌ఫోన్ విడుదల..