NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీలో మందుబాబులకు సర్కారు షాక్.. !

Ap Liquor Policy

Ap Liquor Policy

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. మద్యంపై డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెస్ విధిస్తూ జీవో జారీ చేసింది. మద్యంపై రెండు శాతం సెస్ విధించింది. మద్యం ల్యాండెడ్ రేట్లపై సెస్ విధించేలా ఉత్తర్వులు జారీ చేసింది. సెస్ ద్వారా సుమారు రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. సెస్ ద్వారా వచ్చిన నిధులను డ్రగ్స్ నియంత్రణ, రిహాబిలిటేషన్ సెంటర్లకు ప్రభుత్వం వినియోగించనుంది. సోమవారం మద్యం షాపులను లాటరీ విధానం ద్వారా కేటాయించిన సంగతి తెలిసిందే. ఇక రేపటి నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. తాజా నిర్ణయం ప్రకారం.. అదనపు ప్రివిలేజ్‌ ఫీజు కింద చిల్లర కాకుండా తదుపరి 10 రూపాయలకు పెంచుతూ సవరణ చేశారు. అంటే ఒకవేళ మద్యం బాటిల్ ఎమ్మార్పీ ధర రూ.150.50 కనుక ఉంటే.. దానిని రూ.160కి పెంచేలా అదనపు ప్రివిలేజ్‌ ఫీజు ఉంటుంది. విదేశీ మద్యం బాటిళ్లపై అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద ఎమ్మార్పీ ధరలో చిల్లర కాకుండా.. తదుపరి పది రూపాయలకు పెంచారు.

Read Also: Minister Atchannaidu: పోలవరంను 2027 వరకు పూర్తి చేస్తాం.. మంత్రి అచ్చెన్న కీలక వ్యాఖ్యలు

Show comments