Simhadri Appanna Temple Incident: సింహాచలం చందనోత్సవంలో అపచారం ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనంలో ఉన్న స్వామివారి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు గుర్తు తెలియని భక్తులు.. ఓ వైపు వేడుక జరుగుతుండగానే బయటకు వచ్చాయి ఫొటోలు, వీడియోలు.. స్వామివారి అంతరాలయంలో ఫొటోలు, వీడియోలపై నిషేధం ఉన్నా.. ఇలా బయటకు రావడంతో కలకలం రేగుతోంది.. గత ఏడాది తొలిసారి బయటకు వచ్చాయి అప్పన్న అంతరాలయ వీడియోలు.. ఇప్పుడు మరోసారి ఫొటోలు, వీడియోలు బయటకురావడంపై భక్తులు మండిపడుతున్నారు. అయితే, సింహాచలం దేవస్ధానంలో అపచారాలు, చందనోత్సవ వైఫల్యాలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
Read Also: YS Sunitha Reddy: టీడీపీలోకి వైఎస్ సునీత..? అసలు కారణం ఇదేనా..?
సింహాచలంలో విచారణ చేపట్టారు జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్.. దేవస్ధానంలో సీసీఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలించారు.. చందనోత్సవం టిక్కెట్లు భారీగా రీసైక్లింగ్ జరిగినట్టు యంత్రాంగం భావిస్తోంది.. ఆ దిశగా బాధ్యులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు.. అంతరాలయం వీడియోలు రికార్డింగ్, బయటకు రావడంపై దృష్టిసారించిన అధికారులు.. ఆ దిశగా విచారణ జరుపుతున్నారు.