జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. అప్పు చెల్లింపు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగగా, ఆదర్షనగర్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది రమ్య సుధ (36) అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. పట్టణంలో బట్టల వ్యాపారం నిర్వహిస్తున్న భర్త శ్రీధర్. భార్య రమ్యసుధ వరంగల్ జిల్లా రాయపర్తి గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నది. బట్టల వ్యాపారం సరిగా లేక, ఇంటి నిర్మాణం కోసం అప్పులు ఎక్కువైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read:Bhartha Mahasayulaku Wignyapthi Review: భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ
సంక్రాంతి సెలవులు రావడంతో రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన భార్య.. అప్పుల విషయంలో నిన్న దంపతుల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది రమ్య సుధ. అల్లుడి వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు పిర్యాదు చేసిన తల్లిదండ్రులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.