NTV Telugu Site icon

NBK 109 : బాలయ్య సినిమాకి కొత్త తలనొప్పి.. 5 కోట్ల నష్టం?

Nbk109

Nbk109

NBK 109 : టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల టాలీవుడ్ సీనియర్ హీరోల్లో వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్న బాలకృష్ణ.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టు NBK 109 తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను ఆయన వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ మూవీ.. ఇప్పుడు ఆఖరి అంకానికి చేరుకుంది. సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించిన మేకర్స్.. అందుకు తగ్గ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్ షెడ్యూల్ ను పూర్తి చేసిన చిత్రయూనిట్… ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో యాక్షన్ సీన్లను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో స్టార్ట్ కానున్న కొత్త షెడ్యూల్ లో క్లైమాక్స్ ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య కూడా అందుకు పవర్ ఫుల్ గా నటించేందుకు తనను తాను సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అది అయ్యాక బాలయ్య డబ్బింగ్ పార్ట్ మొదలు పెడతారట.

Read Also:Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!

దీపావళి కానుకగా టైటిల్ ను అనౌన్స్ చేస్తారని అంతా అనుకున్నారు కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి సర్కార్ సీతారామ్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నవంబర్ రెండో వీక్ లో అఫీషియల్ అనౌన్స్ చేస్తామని నిర్మాత నాగవంశీ ఇటీవల చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన సినిమా సంక్రాంతి రిలీజ్ కోసం రూ.5 కోట్ల నష్టాన్ని అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. NBK 109 సినిమాను తొలుత దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ఆ తర్వాత క్రిస్మస్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకువద్దామని అనుకున్నారు. కానీ చివరకు సంక్రాంతికి ఫిక్స్ చేశారు. అయితే NBK 109 డిజిటల్ రైట్స్ ను మేకర్స్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ను మేకర్స్ ఇప్పటికే విక్రయించినట్లు ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు దసరా నుంచి సంక్రాంతికి సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో నెట్ ఫ్లిక్స్ అనుకున్న అమౌంట్ ను తగ్గించాలని ఒత్తిడి చేసిందట.

Read Also:Thandel : అక్కినేని అభిమానులు ఆవేదన.. వినేదెవరు..?

దీంతో ఎలా అయినా చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయిన నిర్మాత నాగవంశీ.. ఒప్పందం ప్రకారం అనుకున్న డబ్బుల్లో రూ.5 కోట్లు తగ్గించి చెల్లిస్తామన్న నెట్ ఫ్లిక్స్ ప్రతిపాదనకు ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్‌, శ్రీకర స్టూడియోస్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమాలో చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ బాణీలు అందిస్తున్నారు.

Show comments