శాసన మండలిలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు నెహ్రూ, కేసీఆర్, సోనియా గాంధీ అని అన్నారు. కేసీఆర్ జనాల గుండెల్లో నిలిచి పోయారని తెలిపారు. వందల ఎకరాలు ఉన్న వాళ్లకు హీరోలకు, హీరోయిన్లకు, ఐఏఎస్ లకు, ఐపీఎస్ లకు రైతు బంధు వద్దని అప్పుడు చెప్పాను.. ఇప్పుడు చెపుతున్నా అని గోరేటి వెంకన్న పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంను అధికారులు బ్లేమ్ చేశారు.. 317 జీవోను తీసుకువచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వంను బదానం చేశారని అన్నారు.
Read Also: CM Revanth Reddy: సీఎం ప్రసంగం అడ్డుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రేవంత్ ఏమన్నారంటే..!
రైతు బంధు, పేదలకు నీళ్ళు ఇచ్చిన సర్కార్ కేసీఆర్ అని కొనియాడారు. అవినీతి అనే మచ్చ లేని అధికారులు ఇప్పుడు ఉన్నారు.. 10 ఎకరాలకు మించి ఉన్న వారికి రైతుబంధు ఇవ్వకూడదని గోరటి వెంకన్న అన్నారు. అధికారులు బలుపుతో కోదండరాం ఇళ్లు తలుపులు పగలకొట్టారు.. హర గోపాల్ మీద ఉపా కేస్ పెట్టారని మండిపడ్డారు. నెహ్రూ వారసులు మీరు తప్పులు చేయకండి.. నా దృష్టిలో నిర్భందం అంటే ఇంద్రవెల్లి ఘటన అని గోరటి వెంకన్న చెప్పారు.
Read Also: CM Revanth: కేసీఆర్.. అమరుల కుటుంబాలకు బుక్కెడు బువ్వ పెట్టారా