NTV Telugu Site icon

Gorantla Butchaiah Chowdary: ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం

Butchaiah Chowdary

Butchaiah Chowdary

Gorantla Butchaiah Chowdary: ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకరుగా బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. బుచ్చయ్య చౌదరితో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌, ఆనం రామనారాయణ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు వెళ్లారు. రేపు ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణ చేయించనున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు ప్రొటెం స్పీకర్‌గా అవకాశం కల్పించారు.

Read Also: Deputy CM Pawan Kalyan: గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలి..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి (జూన్ 21) నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 9.46 నిమిషాలకు ఏపీ శాసన సభ ప్రారంభం కానుంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు సభా కార్యక్రమాలు జరగనున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉండనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. సభ్యులతో ప్రమాణం చేయించనున్నారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు, అనంతరం డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేయనున్నారు. సాధారణ సభ్యుడిగానే వైసీపీ అధినేత జగన్ ప్రమాణం చేయనున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ సభ్యుడిగానే జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంగ్ల అక్షరాల ప్రాతిపదిక వరుస క్రమంలో ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు.