NTV Telugu Site icon

Gorantla Butchaiah Chowdary: రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తా..

Gorantla

Gorantla

TDP- Janasena: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ( Rajahmundry Rural ) లో టీడీపీ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించిన అనంతరం గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Butchaiah Chowdary ) మీడియాతో మాట్లాడుతూ.. రాజమండ్రి రూరల్, నిడదవోలు టీడీపీ- జనసేన ( TDP- Janasena ) ఉమ్మడి అభ్యర్థుల విషయంలో అధిష్టానం క్లారిటీ ఇచ్చిందని స్పష్టం చేశారు. పొత్తులో టిక్కెట్లు విషయమై ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. రాజమండ్రి రూరల్ నుండి టీడీపీ ( TDP ) అభ్యర్థిగా నేనే పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ఇక, నిడదవోలు నుంచి జనసేన అభ్యర్థిగా కందులు దుర్గేష్ పోటీ చేస్తారని వెల్లడించారు. ఈ మేరకు టీడీపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థుల రెండో జాబితాలో పేర్లు ఖరారు చేస్తారని తెలిపారు.

Read Also: Sai Dharam Tej: ఏటిఎం నుంచి బయటికి వచ్చి ఏడ్చేశాను..అమ్మ గొప్పతనం అప్పుడే అర్థమైంది..

ఇక, టీడీపీ- జనసేన ( TDP- Janasena ) పొత్తులో సామరస్యంగా ఎన్నికల్లో పోటీకి వెళ్తాము.. గెలుపు టీడీపీ- జనసేన కూటమి అభ్యర్థులదేనని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఇక, టీడీపీ- జనసేన కూటమి మధ్య ఎలాంటి విభేదాలు రాకూండా తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పొత్తులో టిక్కెట్లు విషయంపై ఎటువంటి విభేదాలు లేవు.. అందరం కలిసే ఈ ఎన్నికల్లో పోటీకి వెళ్తున్నాం.. ఈ సారి జగన్ ను ఓడించడమే టీడీపీ- జనసేన కూటమి యొక్క ప్రధాన లక్ష్యమని మ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి చెప్పుకొచ్చారు.