మ్యాచో స్టార్ గోపీచంద్ రీసెంట్ గా వచ్చిన సినిమా భీమా.. ఈ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అయితే మిక్సీ్డ్ టాక్ ను అందుకోవడం తో మంచి కలెక్షన్స్ ను కూడా అందుకుంది.. ఈ సినిమాలో మరోసారి గోపీచంద్ పవర్ ఫుల్ ఆఫీసర్ రోల్ చేశాడు. గతంలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన గోలీమార్ సినిమాలో పోలీస్‌గా కనిపించిన ఈయన ఇప్పుడు చాలా కాలం తర్వాత భీమాలో కనిపించాడు..
గత కొన్నేళ్లుగా గోపిచంద్ ఖాతాలో సరైన హిట్ సినిమా పడలేదు.. ఈ సినిమాతో హిట్ టాక్ ను అందుకున్నాడు.. పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా వచ్చిన భీమాకు కన్నడ డైరెక్టర్ ఏ హర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టారు. గత నెల మార్చి 8న మహా శివరాత్రి పండుగ సందర్బంగా విడుదలైన ఈ సినిమా ముందుగానే ఓటీటీలోకి రాబోతుంది.. భీమా సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. ఇప్పుడు ఏప్రిల్ 5న భీమా సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది..
అయితే ఆ రోజున సినిమాలు విడుదల కాబోతున్నాయి.. అందుకే ముందుగానే ఓటిటిలోకి రానుందని తెలుస్తుంది.. త్వరలోనే ప్రకటన వెలువడనుంది.. భీమా చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భీమా శాటిలైట్ రైట్స్‌ను బుల్లితెర టీవీ ఛానెల్ స్టార్ మా సొంతం చేసుకుంది.. ఈ సినిమాలో హీరోయిన్ మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా చేశారు. అయితే భీమాలో గోపీచంద్ రెండు పాత్రల్లో కనిపించాయి..