NTV Telugu Site icon

Gopichand Malineni : నేను పుట్టిన గడ్డమీద.. నాకు నచ్చిన హీరోతో.. జీవితానికి ఇది చాలు

Gopichand Malineni

Gopichand Malineni

Gopichand Malineni : నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్‌కు రెడీ అయ్యింది. వీరసింహారెడ్డి ట్రైలర్ కోసం ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ట్రైలర్‌ను కట్ చేశారు చిత్ర యూనిట్. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా పూర్తి ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇక ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను ఒంగోలులో నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌లో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో సందడి చేయగా, పవర్‌ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా బాలయ్య లుక్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఆయన నోటివెంట పవర్‌ఫుల్ డైలాగులు పేలాయి.

Read Also: Nandamuri Balakrishna: బాలయ్య పవర్ పంచులు.. ఎవరికో గట్టిగా తగుల్తున్నాయ్ శీనా..

ఈ సందర్భంగా డైరెక్టర్ మలినేని గోపీ చంద్ మాట్లాడుతూ.. బాలయ్య బాబు మనసు బంగారం.. ఆయన్ని ఒక కంటితో చూస్తూ.. మరో కంటితో డైరెక్షన్ చేశాను అన్నారు. శృతి హాసన్ తో మూడో సినిమా తీస్తున్నాను.. ఆమె చాలా బాగా నటించింది. శ్రుతి నాకు లక్కీ హీరోయిన్. హనీ రోజ్ అద్భుతంగా నటించింది. దునియా విజయ్ కు బాలయ్య బాబు సినిమా చేస్తున్న అనగానే వెంటనే ఓకే చెప్పేశారు. అలాగే ఈ సినిమాలో వరలక్ష్మి.. బాలయ్య బాబును ఢీ కొడుతోంది. బుర్ర సాయి మాధవ్ అద్భుతంగా డైలాగ్స్ రాశారు. నా టీమ్ అంతా బాలయ్య బాబు ఫ్యాన్స్. ఈ సినిమాకోసం పనిచేసిన అందరూ నా వెనక నిలబడ్డారు.. ఫ్యాన్స్ అందరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో అదే వీరసింహారెడ్డి. బాలయ్య బాబు మనసు చాలా మంచిది ఆయనకు చేతులెత్తి నమస్కరించాలి. మా బావ థమన్ ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు. నేను పుట్టిన గడ్డమీద నాకు నచ్చిన హీరోతో.. నా సినిమా ఫంక్షన్ చేసుకుంటున్నాను.. ఇంతకన్నా నా జీవితానికి ఏం కావాలని డైరెక్టర్ గోపీచంద్ అన్నారు.

Show comments