NTV Telugu Site icon

Gpay: వచ్చే నెలలో గూగుల్ పే సేవలు నిలిపివేత..ఎక్కడంటే?

Gpay

Gpay

ప్రస్తుతం నగదు దగ్గర ఉంచుకునే వాళ్ల సంఖ్య తగ్గింది. ప్రతిదీ ఆన్లైన్ మయంగా మారింది. డిజిటల్ చెల్లింపు విధానం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారు. చిరువ్యాపారి నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్థుల వరకు అందరూ వాటిపైనే ఆధారపడుతున్నారు. ఏ చిన్న అవసరానికైనా వీటినే ఉపయోగిస్తున్నారు. రోజు రోజుకు ఈ ఫోన్ పే, గూగుల్ పే వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. మరీ ముఖ్యంగా మొదట్లో గూగుల్ పే స్క్రాచ్ కార్డ్‌లో క్యాష్ బ్యాక్ ఆఫర్ పెట్టి అందరినీ ఆకర్షించింది. ఇక ప్రస్తుతం స్క్రాచ్ కార్డ్‌లో ఓచర్స్, క్యాష్ బ్యాక్ లాంటివి వస్తున్నాయి. అప్పటి నుంచి చాలా మంది గూగుల్ పే వాడేందుకు మొగ్గు చూపారు. అయితే ఈ గూగుల్ పే వాడే వినియోగదారులకు బిగ్ షాక్ తగలనుంది. జూన్ 4 నుంచి గూగుల్‌పేను మూసి వేయబోతున్నట్లు ఆ సంస్థనే స్వయంగా పేర్కొంది. ఏఏ దేశాలలో మూసేయబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

READ MORE: TFPC: డబ్బిచ్చినా పాయల్ సహకరించ లేదు.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక ప్రకటన

గూగుల్ పే ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల్లో సేవలు కొనసాగిస్తోంది. జూన్ 4 తర్వాత గూగుల్ పే యాప్ భారత్, సింగపూర్‌లో మాత్రమే పని చేయనుందంట. అమెరికాలో దీని సేవలు నిలిపివేయబోతున్నట్లు గూగుల్ తెలిపింది. కంపెనీ ప్రకారం వినియోగదారులందూ గూగుల్ వాలెట్‌కి బదిలీ చేయబడతారని వెల్లడించింది. అందువలన గూగుల్ పే సేవలు బంద్ కానున్నాయి. గూగుల్ వాలెట్‌ను ప్రమోట్ చేసేందుకే కంపెనీ ఇలాంటి చర్య తీసుకుందని భావిస్తున్నారు. దాదాపు 180 దేశాల్లో గూగుల్ పేని గూగుల్ వ్యాలెట్ భర్తీ చేసిందని కంపెనీ తన బ్లాగ్‌లో పేర్కొంది. కాగా.. గూగుల్ పే, గూగుల్ వాలెంట్ ఈ రెండూ భిన్నమైన యాప్స్. అలాగే ఇవి అందించే సర్వీసుల్లోనూ తేడాలు ఉన్నాయి. వీటిని మీరు పూర్తిగా ఉపయోగించొచ్చు. గూగుల్ వాలెట్లో టికెట్స్, రివార్డ్స్ ఇతర కీలను ఇందులో సేవ్ చేసుకోవచ్చు. ఈ వాలెట్‌కు బలమైన సెక్యూరిటీ ఉంటుంది. అయితే Google Payలో చేసినట్టుగా ఆన్‌లైన్ లావాదేవీలను ఇక్కడ నిర్వహించడం సాధ్యం కాదు.