TFPC: డబ్బిచ్చినా పాయల్ సహకరించ లేదు.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Film Producers Council Releases a Press Note on Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన రక్షణ మూవీకి సంబంధించి ఒక వివాదం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎప్పుడో నటించానని, అయితే తనకు ఇవ్వాల్సిన డబ్బు క్లియర్ చేయకుండా ఇప్పుడు ప్రమోషన్స్ కి రమ్మని పిలుస్తున్నారని పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే వ్యవహారం మీద నిర్మాత తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేసిన అంశం మీద ఒక కీలక ప్రకటన రిలీజ్ చేశారు. రక్షణ అనే సినిమాకి దర్శక నిర్మాతగా వ్యవహరించిన ప్రాణదీప్ ఠాకూర్ పాయల్ రాజ్ పుత్ అగ్రిమెంట్ చేసుకున్న విధంగా కాకుండా తనకు ప్రమోషన్స్ విషయంలో సహకరించడం లేదని పేర్కొన్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 19వ తేదీన రిలీజ్ చేయడానికి సిద్ధమై పాయల్ రాజ్ పుత్ ని ప్రమోషన్స్ చేయమని అడిగితే నాలుగేళ్ల పాత సినిమా కాబట్టి ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయమని ఆమె సలహా ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Jani Master: రేవ్ పార్టీలో జానీ మాస్టర్.. అసలు విషయం చెప్పేశాడు!
Also Read
- Daredevil: ఆ క్రేజీ సినిమా షూటింగ్‌పై శ్రీలీల సాలిడ్ అప్డేట్!
- Itlu Arjun సక్సెస్ క్రెడిట్ నాది కాదు.. ఆ హార్డ్ వర్క్ అంతా వారిదే: నాగార్జున
- Giribabu Death:బాధతో మాటలు రావడం లేదు’.. గిరిబాబు మృతిపై మోహన్ బాబు ఎమోషనల్!
- Nagarjuna: నా ట్రాక్ రికార్డ్ చూడండి ఫ్లాప్ అయితే కాలేదు.. సినిమా ప్రెజెంటేషన్‌పై నాగార్జున బోల్డ్ కామెంట్స్!
అయితే అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా కోసం పాయల్ 50 రోజులు పని చేయాల్సి ఉంది. అయితే నిర్మాత 47 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశారు. అలాగే అగ్రిమెంట్ ప్రకారం 50 రోజులతో పాటు అన్ని రకాల సినిమా ప్రమోషన్స్ కి పాయల్ రాజ్‌పుత్ హాజరు కావాల్సి ఉంటుంది. ఇంకా తాను ఇవ్వాల్సిన ఆరు లక్షలు పాయల్ రాజ్ పుత్ కి చెక్కు రూపంలో చెల్లించానని, సినిమా రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ పూర్తి చేస్తే ఆ చెక్ క్లియర్ చేసేలా ఒప్పందం చేసుకున్నామని చెప్పుకొచ్చారు. అయితే పాయల్ రాజ్ పుత్ ప్రమోషన్స్ కి రాకపోవడం వల్ల తను చాలా నష్ట పోయానని సినిమాని విడుదల కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందని నిర్మాతల మండలికి ప్రాణదీప్ ఫిర్యాదు చేశారు. నిజానికి పాయల్ ప్రియుడు సౌరబ్ డింగ్రా ఆమెకు మేనేజర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.
పాయల్ ప్రమోషన్స్ లో పాల్గొంటే ఆమెకు రావాల్సిన ఆరు లక్షలు క్లియర్ చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని నిర్మాత చెప్పినా సరే నాలుగేళ్ల పాత సినిమా కాబట్టి తాను ప్రమోట్ చేయనని పాయల్ తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ ఫిర్యాదుని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఫార్వర్డ్ చేసింది. అయితే పాయల్ రాజ్ పుత్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ కాదని చెప్పడంతో ఇప్పుడు ఇదే విషయాన్ని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కి కౌన్సిల్ ఫార్వర్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ నెల నుంచి క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తుంటే సోషల్ మీడియాలో పాయల్ రాజ్ పుత్ తన వైపు నుంచి ఏం తప్పే లేదు అన్నట్టు పోస్ట్ పెట్టుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాయల్ పేరు ఫోటోలు వాడుకోవడంలో తప్పేమీ లేదని ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వెల్లడించింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏకమవుదాం
-
Daredevil: ఆ క్రేజీ సినిమా షూటింగ్‌పై శ్రీలీల సాలిడ్ అప్డేట్!
-
BM Sandeep : తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా బీఎం సందీప్ నియామకం
-
Mohit Ulva: చివరి బంతికి కావాల్సింది 3 పరుగులు.. ఆ టైంలో నేను చేసింది ఇదే..
-
Shehbaz Sharif: 2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్థాన్.. అప్పుల ఊబిలో ఉన్నా భారీ లక్ష్యం!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!