Site icon NTV Telugu

Google Map: గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త విప్లవం.. ఇకపై మ్యాప్స్‌తో మాట్లాడవచ్చు..

Google Maps.. Gemini Ai

Google Maps.. Gemini Ai

గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు కేవలం మార్గాన్ని చూపించే దిక్కూచీ మాత్రమే కాదు.. మీ ప్రయాణంలో తోడుండే ఒక స్నేహితుడిలా మారుతోంది. ప్రయాణాల్లో కొత్త అనుభూతిని అందించేందుకు గూగుల్ ఇటీవల రెండు కొత్త జెమిని ఏఐ ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. అవి మన దైనందిన ప్రయాణాలను మరింత సులభతరం చేస్తాయి.

మ్యాప్స్‌తో మాట్లాడండి..
ఇకపై మీరు మ్యాప్స్‌ను నేరుగా అడగవచ్చు. ఉదాహరణకు.. ‘ఎక్కువ క్యూలో నిలబడకుండా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే చోటు ఎక్కడ ఉంది? లేదా పిల్లలతో వెళ్లడానికి ప్రశాంతంగా ఉండే పార్కు ఏది? అని మీరు అడిగితే.. గూగుల్ మ్యాప్స్ మీకు సమాధానం చెబుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది ప్రదేశాల సమాచారాన్ని విశ్లేషించి.. మీ ఇష్టాయిష్టాలకు తగ్గట్టుగా సరైన సూచనలను ఇస్తుంది.

Also Read:Fastag: వాహనాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ కొత్త ధరలు..

కళ్ళకు కట్టినట్లు ఇమ్మర్సివ్ నావిగేషన్..
మనం వెళ్లే దారిని ఇకపై బొమ్మల రూపంలోనే కాకుండా.. త్రీ-డీ (3D) రూపంలో స్పష్టంగా చూడవచ్చు. ఈ ఫీచర్ ద్వారా దారిలో ఉండే పెద్ద భవనాలు, ఫ్లై ఓవర్లు, రోడ్డు పక్కన ఉండే పరిసరాలను చాలా వివరంగా గూగుల్ చూపిస్తుంది. దీనివల్ల మనం ఎటువైపు వెళ్లాలో.. ఏ మలుపులో తిరగాలా అనేది చాలా సులభంగా అర్థమవుతుంది. ఇది చూస్తుంటే.. మనం ప్రయాణించబోయే దారిని ముందే ఒకసారి చూసినట్లుగా ఉంటుంది.

Also Read:Twin Sister: తోడబుట్టిన చెల్లి అని కూడా చూడలేదు.. 40 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు..

మొత్తంగా చెప్పాలంటే.. గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు కాలంతో పాటే అప్ డేట్ అవుతోంది. ఇది మనల్ని గమ్యస్థానానికి చేర్చడమే కాకుండా.. మన అవసరాలను అర్థం చేసుకుని, దారిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాన్ని ఆనందంగా మార్చేలా కృషి చేస్తోంది. కొత్తగా వచ్చే ఈ మార్పులు అందరికీ ఎంతగానో ఉపయోగపడతాయి. సాంకేతికత ఎంత వేగంగా మారుతుందో.. మన జీవనశైలి కూడా అంతగా సులభమవుతోంది.

Exit mobile version