Discounts on Google Pixel 8 and7 Phones: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్’ కొత్త మోడళ్లను లాంచ్ చేసినప్పుడు.. పాత మోడళ్ల ధరలను తగ్గిస్తుంటుంది. ఇదే స్ట్రాటజీని ‘గూగుల్’ ఫాలో అవుతోంది. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లు లాంచ్ అయిన నేపథ్యంలో పిక్సెల్ 8, 7 సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సవరించిన ధరలు త్వరలో అందుబాటులోకి వస్తాయని గూగుల్ ప్రకటించింది. గూగుల్ ప్రస్తుతం తన పిక్సెల్ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తోన్న విషయం తెలిసిందే.
పిక్సెల్ 8 ప్రో 128జీబీ వేరియంట్ ధర రూ.1,06,999 కాగా.. రూ.99,999కే అందుబాటులో ఉంటుందని గూగుల్ ప్రకటించింది. అంటే 7 వేలు ఆదా చేసుకోవచ్చు. బ్యాంకు ఆఫర్స్ ద్వారా ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉంది. పిక్సెల్ 8 ఫోన్ ధర రూ.75,999గా ఉండగా.. ఇప్పుడు రూ.71,999కే లభించనుంది. పిక్సెల్ 8ఏపై రూ.3 వేలు, పిక్సెల్ 7ఏ మోడల్‌పై రూ.2వేలు డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో పిక్సెల్ 8ఏ బేస్ వేరియంట్ రూ.49,999కి.. పిక్సెల్ 7ఏ బేస్ వేరియంట్ రూ.41,999కి అందుబాటులో ఉంటాయి.
Also Read: Google Pixel Buds Pro 2: గూగుల్ పిక్సెల్ నుంచి బడ్స్, వాచ్.. ధర, ఫీచర్లు ఇవే!
పిక్సెల్ 9 సిరీస్‌లో మొత్తం నాలుగు మోడల్స్ రిలీజ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ , పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఉన్నాయి. గూగుల్ ప్రస్తుతం తన పిక్సెల్ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నా.. పిక్సెల్ 9 సిరీస్ ఫోన్స్ మాత్రం రిలయన్స్ డిజిటల్, క్రోమా వంటి ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ లభించనున్నాయి. బెంగళూరు, ఢిల్లీ, ముంబైలో ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను కూడా నెలకొల్పనున్నట్లు ప్రకటించింది.