NTV Telugu Site icon

TCS: జాబ్ చేయలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఆ కంపెనీలో 40వేల మందికి ఫ్రెషర్లకు ఛాన్స్

Tcs

Tcs

TCS: ఉద్యోగం లేఖ ఖాళీగా ఉన్నారా.. సాఫ్ట్ వేర్ కోచింగ్ తీసుకుని జాబ్ కోసం వేచి చూస్తున్నారా.. అయితే మీకు సువర్ణావకాశం. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. సీనియర్లకు కాకుండా.. ఫ్రెషర్లకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించబోతుంది. టీసీఎస్ సీవోవో ఎన్. గణపతి సుబ్రమణియన్ తాము క్యాంపస్ నుంచి పెద్ద సంఖ్యలో నియామకాలు చేసుకోనున్నట్టు ప్రకటించారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న పరిస్థితుల్లోనూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం 40,000 మంది ఫ్రెషర్లను తీసుకోనున్నట్టు టీసీఎస్ పేర్కొంది.

కేవలం ఈ సంవత్సరం అని కాకుండా.. ప్రతీ సంవత్సరం 35వేల నుంచి 40 వేల మంది ఫ్రెషర్లకు టీసీఎస్ కంపెనీ ఉపాధి కల్పిస్తోంది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులను పెద్ద మొత్తంలో తొలగించబోయని సుబ్రమణియన్ తెలిపారు. క్యాంపస్ నియామకాల పట్ల తాము సానుకూలంగా ఉన్నామని, మిగిలిన ఐటీ కంపెనీలు భిన్నమైన వైఖరితో వ్యవహరిస్తున్నాయని చెప్పారు. ఇటీవలే ఇన్ఫోసిస్ సీఎఫ్ వో నీలాంజన్ రాయ్ మాట్లాడుతూ.. తాము గత ఏడాది 50,000 మంది ఫ్రెషర్లను తీసుకున్నట్టు చెప్పారు. డిమాండ్ పరిస్థితులు పుంజుకునే వరకు (ఐటీ సేవల కోసం) క్యాంపస్ నియామకాలు చేపట్టేది లేదన్నారు.

నిజానికి డిమాండ్ పరిస్థితులకు తగ్గట్టుగానే ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాలు చేపడుతారు. టీసీఎస్ ఇందుకు మినహాయింపు కాదని సీవోవో చెప్పారు. కానీ, గడిచిన 12-24 నెలల్లో ఉద్యోగుల వలసల రేటు ఎక్కువగా ఉందని.. అందుకే సాధారణం కంటే ఎక్కువ మందిని నియమించుకునే ఆలోచనతో ఉన్నామని ఆయన తెలిపారు.