ఉద్యోగం లేఖ ఖాళీగా ఉన్నారా.. సాఫ్ట్ వేర్ కోచింగ్ తీసుకుని జాబ్ కోసం వేచి చూస్తున్నారా.. అయితే మీకు సువర్ణావకాశం. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. సీనియర్లకు కాకుండా.. ఫ్రెషర్లకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించబోతుంది. టీసీఎస్ సీవోవో ఎన్. గణపతి సుబ్రమణియన్ తాము క్యాంపస్ నుంచి పెద్ద సంఖ్యలో నియామకాలు చేసుకోనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం 40,000 మంది ఫ్రెషర్లను తీసుకోనున్నట్టు టీసీఎస్ పేర్కొంది.