గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన పసిడి ధర.. జూన్ 3వ తేదీన భారీగా తగ్గుముఖం పట్టింది. ఇక ఆదివారం బంగారం ధర కొంత స్థిరంగా కొనసాగింది. తాజాగా ఇవాళ (సోమవారం) కూడా గోల్డ్ రేట్‌లో పెరుగుదల కనిపించకపోవడంతో పాటు స్థిరంగా కొనసాగుతోంది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 55,450 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. రూ. 60,480గా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
Also Read : Tiananmen Square: సొంత ప్రజల పైన చైనా మారణహోమానికి 34 ఏళ్లు..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,330 గా ఉంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,330గా ఉంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,330 లుగా పలుకుతోంది.
Also Read : Tesla Car : టెస్లా ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్.. రూ.80వేలు తగ్గింపు
దేశవ్యాప్తంగా బంగారం ధరలు..
* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,480 గా కొనసాగుతుంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,330గా ఉంది.
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,870 పలుకుతుంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,330గా కొనసాగుతుంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,330 లుగా ఉంది.
Also Read : LIVE : సోమవారం నాడు ఈ స్తోత్రాలు వింటే సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతారు
ప్రస్తుతం వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73 వేలుగా ఉంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో రూ.73వేలుగా ట్రెండ్ అవుతోంది. ఇక చెన్నైలో రూ.77,800, కేరళలో రూ.77,800 పలుకుతోంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో రూ.77,800 లుగా ఉంది.