NTV Telugu Site icon

TS News: ఖైదీలకు గుడ్‌న్యూస్.. జైలు నుంచి ఎంతమంది విడుదలయ్యారంటే..!

Prisoners

Prisoners

హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైదీల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు గుడ్‌న్యూస్ చెప్పింది. సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా కొంత మంది ఖైదీలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. జీవిత ఖైదు అనుభవిస్తూ అనారోగ్యం, వృద్ధాప్యం, ఇతర సమస్యలతో బాధపడుతున్న ఖైదీల శిక్షాకాలాన్ని తగ్గిస్తూ క్షమాభిక్ష ప్రసాదించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Read Also: Jaggareddy: కోదండరాంను మీరు అవమానించారు, మేము గౌరవిస్తున్నాం.. బీఆర్ఎస్ నేతలపై ఫైర్

ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జైళ్లలో మంచి ప్రవర్తన కలిగిన 231 మంది ఖైదీలు ఎంపికయ్యారు. జీవితకాల ఖైదీలు 212 మంది, జీవితేతర ఖైదీలు 19 మందిని అధికారులు విడుదల చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఖైదీల కుటుంబాల్లో సంతోషం వెల్లువిరుస్తోంది. ఇక ఎంతో కాలంగా కుటుంబాలకు దూరమైన ఖైదీలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం రెండు విడతల్లో 400 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టింది. తాజాగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక ఒకేసారి ఏకంగా 231 మంది ఖైదీల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

Read Also: Tata-Airbus: టాటా-ఎయిర్‌బస్ కీలక ఒప్పందం.. సంయుక్తంగా హెలికాప్టర్ల తయారీ..