NTV Telugu Site icon

Delhi: అన్నదాతలకు కేంద్రం శుభవార్త.. ఇక నుంచి రూ.9వేలు..!

Pm Kisan

Pm Kisan

ఢిల్లీ: ఎన్నికల ముందు కేంద్రం తాయిలాలు ప్రకటించబోతుందా? మూడోసారి ముచ్చటగా అధికారం చేపట్టేందుకు మోడీ సర్కార్ ప్రణాళికలు వేసిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే గురువారం (ఫిబ్రవరి 1న) కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25 మధ్యంతర బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనున్నారు. రెండు నెలల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్నదాతలకు, ప్రజలకు తాయిలాలు ప్రకటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్, గ్రామీణ ఉపాధి హామీ పథకం, పీఎం కిసాన్ వంటి పథకాల్లో కీలక మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read Also: CM Review: రేపు ఆర్ధిక శాఖపై సీఎం జగన్ సమీక్ష..

ప్రాముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకుని కీలక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ సాయం రూ.9 వేలకు పెంచబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏడాదికి రూ.6 వేలు సాయం అందిస్తున్నారు. కర్షకుల ఖాతాల్లో 15 సార్లు పీఎం కిసాన్ యోజన నిధులు జమయ్యాయి. అంటే ఇప్పటి వరకు రూ.30 వేలు అకౌంట్లలో పడ్డాయి. అయితే పెరిగిన ఎరువులు, కూలీల ఖర్చుల పెరగడంతో ఆర్థిక సాయాన్ని పెంచాలని అన్నదాతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ సాయం పెంచేందుకు కేంద్రం కసరత్తు చేసినట్లు వార్తలు వినిపించాయి. వచ్చే బడ్జెట్‌లో ఈ సాయం రూ.9 వేలకు పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: Amy Jackson: ప్రియుడితో బిడ్డను కని.. ఇప్పుడు వేరొకరిని పెళ్ళాడుతున్న బ్యూటీ