NTV Telugu Site icon

AP Pensions: పింఛన్‌దారులకు శుభవార్త.. ఈ నెల 31నే పింఛన్లు

Ap Pensions

Ap Pensions

AP Pensions: పింఛనుదారులకు ఏపీ ప్రభుత్వ శుభవార్త తెలిపింది. ఈ నెల 31వ తేదీ నాడే పింఛనుదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రావడంతో వృద్ధాప్య, వితంతువు, ఇతర పింఛన్లను ఈ నెల 31వ తేదీనే ఇస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.

Read Also: Andhra Pradesh: మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ నియామకం

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. “1వ తేదీన పింఛన్‌ ఇచ్చే క్రమం ఆదివారం వచ్చింది. పింఛన్‌దారులకు ఇబ్బంది కలగకుండా చూడటమే ప్రభుత్వ విధి. గవర్నమెంటు ఉద్యోగులకు ఆదివారం సెలవు కావున పెన్షన్ పంపిణీ వాయిదా వేయకుండా ఒక రోజు ముందుగానే శనివారం 31నే ఇచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు . కావున ఈ నెల 31వ తేదీన పింఛన్‌ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా 31వ తేదీన పెన్షన్ తీసుకోని వారు ఉంటే వారికి 2వ తేదీన పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం పింఛన్‌దారులందరూ గమనించాలి. పింఛన్‌దారులు 31వ తేదీన పింఛన్‌ తీసుకొనే ప్రయత్నం చేయాలి. లేనిపక్షంలో 2వ తేదీన పింఛన్‌ తీసుకునే అవకాశం ఉంది. 31న, 2వ తేదీన పింఛన్‌ తీసుకునే పరిస్థితులున్నాయి. పింఛన్‌దారులు ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించుకోవాలి. సాధ్యమైనంతవరకు 31వ తేదీనే పెన్షన్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా 1వ తేదీన ఆదివారం వస్తే 31వ తేదీన పింఛన్ ఇచ్చే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. కావున ప్రస్తుతం31 లేదా 2వ తేదిన ఎప్పుడైనా పెన్షన్ తీసుకోవచ్చు.” అని మంత్రి తెలిపారు.

Read Also: CM Chandrababu: రూ.10 లక్షల బీమాకు త్వరలో శ్రీకారం.. కార్మికులకు సీఎం గుడ్‌న్యూస్

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రోజూ జరిగే గ్రీవెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి పలువురు అనేక సమస్యలను గ్రీవెన్స్ కార్యక్రమంలో తమ దృష్టికి తెచ్చారని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా కొన్ని రెవెన్యూ సమస్యలపై కూడా దరఖాస్తులు వచ్చాయన్నారు. గ్రీవెన్స్‌లో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఇంకా వివిధ సమస్యలపై కూడా దరఖాస్తులు వస్తున్నాయన్నారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు.