NTV Telugu Site icon

TG DSC 2024: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్.. టెట్ వివరాలను ఎడిట్ చేసుకునే అవకాశం

Dsc Ecams 2024

Dsc Ecams 2024

TG DSC 2024: డీఎస్సీ అభ్యర్థులకు పాఠశాల విద్యా శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. డీఎస్సీ అభ్యర్థులు టెట్ వివరాలను అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఎడిట్ చేసుకోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి పాఠశాల విద్యా శాఖ వెసులుబాటు కల్పించింది. ఈ నెల 12, 13 తేదీల్లో ఎడిట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 13వ తేదీ తర్వాత మార్పులకు ఎలాంటి ఛాన్స్ లేదని పాఠశాల విద్యా శాఖ పేర్కొంది.

Read Also: Telangana: సెప్టెంబర్‌ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ టెట్ 2024 ఫలితాలు జూన్‌ 12వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. మే 20 నుంచి జూన్‌ 2 వరకు జరిగిన ఈ పరీక్షలకు పేపర్‌-1కు 85,996 మంది, పేపర్‌-2కు 1,50, 491 మంది మంది అభ్యర్థులు హాజరయ్యారు. రిజల్ట్‌లో పేపర్‌-1లో 57,725 మంది అభ్యర్థులు, పేపర్‌-2లో 51,443 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. టీజీ డీఎస్సీలో వచ్చిన మార్కులకు టెట్‌ మార్కులను కలిపి తుది ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే తాజాగా డీఎస్సీ ఫైనల్ కీ వెలువడిన విషయం విదితమే. ఇదిలా ఉండగా.. రెండు మూడు రోజుల్లో డీఎస్సీ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే డీఎస్సీ మార్కులకు టెట్ మార్కులను కలిపి జనరల్‌ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేస్తే, తర్వాత టెట్ వివరాల అప్‌డేట్‌లో దొర్లిన తప్పులను సవరించే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో టెట్ వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు పాఠశాఖ విద్యాశాఖ అవకాశం కల్పించింది.

Show comments