NTV Telugu Site icon

Gold And Silver Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Rates Drop

Gold Rates Drop

Gold And Silver Rates: పసిడి ప్రియులకు శుభవార్త. గత కొంతకాలంగా రాకెట్ వేగంతో దూసుకు వెళ్లిన బంగారం ధరలు.. ఇప్పుడిప్పుడే తగ్గుతున్నట్లుగా కనబడుతోంది. బంగారంతో పాటు మరోవైపు వెండి కూడా నేల చూపులు చూస్తోంది. ఇదివరకు బాగా తగ్గిన బంగారం ధరలు, గత వారంలో మళ్లీ పెరగడం జరిగింది. అయితే, ప్రపంచ పరిస్థితుల నడుమ బంగారం ధరలు మళ్ళీ తగ్గు ముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 300 రూపాయల తగ్గి రూ. 70,400 ధర వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.330 తగ్గి 76,800 వద్ద కొనసాగుతోంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధరలలో కూడా 10 గ్రాములకు రూ. 250 తగ్గి 57,600 వద్ద కొనసాగుతోంది.

Also Read: Gold Rate Today: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర!

ఇక బంగారం తోపాటు వెండి కూడా తగ్గు ముఖం పట్టింది. గత నాలుగు రోజుల నుంచి ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా కొనసాగిన వెండి ధర నేడు ఏకంగా కేజీపై రూ. 1000కి పైగా తగ్గింది. దీంతో హైదరాబాద్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కిలో వెండి ధర 98,000గా కొనసాగుతోంది. మిగితా రాష్ట్రాలలో కిలో వెండి ధర రూ.90,500గా ఉంది.

Show comments