NTV Telugu Site icon

Goldman Sachs : హైదరాబాద్‌లో కార్యకలాపాలను విస్తరిస్తున్న గోల్డ్‌మన్ సాచ్స్

Ktr

Ktr

అమెరికన్ బహుళజాతి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ పవర్‌హౌస్ గోల్డ్‌మన్ సాచ్స్ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరింపజేయనుంది. ఈ కంపెనీ త్వరలో కొత్త ఎనిమిది అంతస్తుల కార్యాలయాన్ని ప్రారంభించి, ఇక్కడ ఉద్యోగుల సంఖ్యను 3,000కు పెంచనుంది. గోల్డ్‌మన్ సాక్స్ ఈ పెట్టుబడి హైదరాబాద్‌లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగానికి ఊతమిచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గోల్డ్‌మన్ సాక్స్ హైదరాబాద్ కార్యాలయం 1000 మంది ఉద్యోగులతో పనిచేస్తుంది.

Also Read : Asia Cup 2023: ఆసియా కప్‌ 2023లో ముగ్గురు అందాల భామలు.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కూతురు కూడా!

తాజా విస్తరణ ప్రణాళిక ప్రకారం, కంపెనీ తన కొత్త ఎనిమిది అంతస్తుల కార్యాలయాన్ని 2,000 మంది నిపుణులతో ప్రారంభించనుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్యను హైదరాబాద్‌లో 3000కు పెంచేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై కూడా కేంద్రం దృష్టి సారిస్తుందని అధికారిక ప్రకటన ప్రకారం, కొత్త కార్యాలయం వినియోగదారుల బ్యాంకింగ్ సేవలు, వ్యాపార విశ్లేషణలు, ప్లాట్‌ఫారమ్ ఇంజనీరింగ్‌కు అత్యుత్తమ కేంద్రంగా ఉద్భవించనుంది.

Also Read : Jangaon BRS: జనగామలో పొలిటికల్ హీట్.. బీఆర్ఎస్ లో కొనసాగుతున్న టికెట్ వార్..

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం న్యూయార్క్‌లో గోల్డ్‌మన్ సాక్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలకు ఇష్టమైన గమ్యస్థానంగా మార్చడంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి సానుకూల ఫలితాలను ఇస్తోందని అన్నారు. గోల్డ్‌మ్యాన్ సాచ్స్ విస్తరణ BFSI హబ్‌గా హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది, BFSI రంగాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలు హైదరాబాద్‌ను ఆర్థిక కేంద్రంగా ఆకర్షణీయంగా మార్చడానికి గణనీయంగా దోహదపడిందని ఆయన అన్నారు.