NTV Telugu Site icon

Gold Seized: ఏం తెలివిరా నాయనా.. సూట్‌కేస్ లైనింగ్‌లో కేజీకి పైగా బంగారం

Gold Seized

Gold Seized

Gold Seized: విమానాశ్రయాలు గోల్డ్‌ స్మగ్లింగ్‌కు అడ్డాలుగా మారుతున్నాయి. బంగారం అక్రమ రవాణాకు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూ బంగారాన్ని తరలిస్తున్నారు. అయితే కస్టమ్స్ అధికారుల ముందు బంగారం స్మగ్లర్ల ఆటలు సాగడం లేదు. మీరు ఏ రూట్‌లో వచ్చినా పట్టుకుంటాం అంటూ మళ్లీ నిరూపించారు కస్టమ్స్ అధికారులు. తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో ప్రయాణికుల నుంచి భారీగా బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దాదాపు రూ. 46.24లక్షల విలువైన 1038 గ్రాముల బంగారాన్ని కొలంబో నుంచి చెన్నైకి వచ్చిన ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.

Rishab Shetty: ‘కాంతార’ హీరో ఫ్యామిలీ చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో

ఇక్కడ తమ సత్తాను మరోసారి నిరూపించారు కస్టమ్స్ అధికారులు. గోల్డ్ స్మగ్లర్లు ఈ సారి తెలివిగా ట్రాలీ సూట్‌కేస్ బయటి లైనింగ్‌లో బంగారాన్ని దాచి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ స్మగ్లర్ల ప్రయత్నం ఫలించలేదు. సూట్‌కేస్ లైనింగ్‌లో బంగారం ఉందని తెలుసుకున్న అధికారులు.. ఆ ట్రాలీ సూట్‌కేసును కత్తితో కోసి బంగారాన్ని వెలికితీశారు. అధికారులు తమ తెలివిని ఉపయోగించి సూట్‌కేస్‌ లైనింగ్‌లో నుంచి బంగారం వెలికితీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.