Gold Stolen: నగల దుకాణంలో పట్టపగలు 69 గ్రాముల నగలు చోరీకి గురైన ఘటన పుణెలో సంచలనం సృష్టించింది. కస్టమర్ గా మారిన ఓ దొంగ రూ.5 లక్షల విలువైన నగలను దోచుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై ఖడక్ పోలీస్ స్టేషన్‌లో దొంగతనం కేసు నమోదైంది. ఈ ఘటన మొత్తం షాపులోని సీసీటీవీలో రికార్డయింది. ఆభరణాలతో నిందితుడు పరారీ కాగా, సీసీటీవీ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Also: HMDA: హెచ్ఎండీఏ పేరుతో మోసం.. సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం
పూణేలోని భవానీ పేటలోని నగల దుకాణంలోకి సాయంత్రం 4 గంటల సమయంలో ఓ వ్యక్తి కస్టమర్ గా వచ్చాడు. దొంగ మొదట షాపులో ఒక గ్రాము బంగారం కొన్నాడు. ఆ తర్వాత దుకాణదారుని మరికొన్ని ఆభరణాలు చూపించమని కోరాడు. దాదాపు 69 గ్రాముల బరువున్న ఆభరణాలను దుకాణదారుడు అతనికి చూపించాడు. ఐదు నిమిషాల తర్వాత ఆభరణాలు చూసుకుని బయటకు వెళ్లాడు. తర్వాత బయటి నుంచి చిన్న చిన్న రాళ్లను జేబులో పెట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు. దుకాణదారుడి దృష్టికి రాకుండా చిన్న చిన్న రాళ్లను నగల పౌచ్‌లో ఉంచి.. నగలు చూస్తూ మెల్లగా వాటిని జేబులో పెట్టుకున్నాడు. అనంతరం ఫోన్‌లో మాట్లాడి బయటకు వచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు.
Read Also:Missing: డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది.. నెలరోజులు గడిచింది అయినా
కేసు నమోదు
దొంగతనాన్ని గమనించిన దుకాణదారు వెంటనే ఖడక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దుకాణదారు ఫిర్యాదు మేరకు పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు. దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా దొంగ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.