Site icon NTV Telugu

Gold Seized: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. నలుగురు అరెస్ట్

Gold

Gold

Gold Seized: హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది.600 గ్రాముల‌ బంగారాన్ని సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి కేటుగాళ్లు బంగారంతో బయటకు వచ్చారు. అక్కడి నుంచి అరైవల్స్ ప్రాంతంలో బంగారాన్ని రిసీవర్స్‌కు ఇస్తుండగా సీఐఎస్‌ఎఫ్ అధికారులు ఆ కేటుగాళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Read Also: Satvik Suicide Case: శ్రీ చైతన్య కాలేజీపై ఎంక్వైరీ రిపోర్టు.. సాత్విక్ ఘటనలో ప్రభుత్వానికి నివేదిక

నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆ నిందితులను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కస్టమ్స్ అధికారులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ సిబ్బందిని సీఐఎస్‌ఎఫ్ డీజీ అభినందించారు.

Exit mobile version