Gold Rates: పసిడి అంటే ఇష్టపడని మగువలు ఉండరు. ఎంత బంగారం ఉన్నా.. ఇంకా కావాలి ఇంకా కావాలి అనే కోరిక మహిళల్లో బీభత్సంగా ఉంటుంది. ధరలు ఎక్కువున్నా సరే.. షాపుల్లోకి వెళ్లి కొనేస్తారు. శనివారం బంగారం ధరల రేట్ల విషయానికొస్తే.. ఇండియాలో అనేక నగరాల్లో పసిడి రేట్లు 24 క్యారెట్లకు రూ.60,000 కంటే పైగానే ఉన్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.61,250గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,150. మరోవైపు కిలో వెండి ధర రూ.73,400గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.61,150, , 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.56,050గా ఉన్నాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.61,100, 22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ.56,000గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 190 పెరుగుదలతో రూ. 56,390, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెంపుతో రూ. 61,950 ధర ఉంది.
Read Also: David Warner: ఇది హాస్యాస్పాదం.. ఆస్ట్రేలియా బోర్డుపై వార్నర్ ఫైర్
మరోవైపు ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 300 పెంపుతో రూ. 56,000 , 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 340 పెంపుతో రూ. 61,100 ఉంది. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,100గా ఉంది. వెండి విషయానికొస్తే.. హైదరాబాద్, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 78,600గా ఉంది.
Read Also: Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద ప్రదేశానికి ప్రధాని మోడీ
ఇండియాలో బంగారం ధరలు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం రేట్లు, కరెన్సీ హెచ్చుతగ్గులు, స్థానిక డిమాండ్ ఇంకా సప్లయ్ డైనమిక్స్‌తో సహా వివిధ కారకాలచే ప్రభావితమవుతాయి. 2021-22లో పసిడి దిగుమతులు USD 46.2 బిలియన్లుగా ఉన్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులు 6.12 శాతం పెరిగి 5.29 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1947.90 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ ఔన్సుకు $23.64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత కరెన్సీ రూపాయి మారకం విలువ గ్లోబల్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూ.82.428 మార్క్ వద్ద ట్రేడవుతోంది. పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు డిక్లేర్ అవుతాయి.