Youth Marries Dead Girlfriend : ఆ ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి ఉండాలని కలలు కన్నారు. కానీ విధి వారి జీవితాలతో ఆడుకుంది. ఉన్నట్లుండి ప్రియురాలు అనారోగ్యం కారణంగా చనిపోయింది. కానీ ప్రియుడు ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. తాను తప్ప వేరే వారికి తన జీవితంలో చోటు లేదని చనిపోయిన ప్రియురాలి మృతదేహానికి తాళికట్టి తన దాన్ని చేసుకుని ప్రేమంటే తనదే అంటూ చాటుకున్నాడు. అంతటితో ఆగకుండా జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకోనని కుటుంబ సభ్యుల ముందే తాళి కట్టి శపథం చేశాడు. ఈ అరుదైన ఘటన అసోంలో చోటు చేసుకుంది.
Read Also: Jogi Ramesh: చంద్రబాబుపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు.. పవన్‌ను కూడా ఏకిపారేశాడు..!
అసోంలోని మోరిగావ్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల బిటుపన్ తములి, కౌసువ గ్రామానికి చెందిన 24 ఏళ్ల ప్రాథనా బోరా ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే ఇటీవలే అనారోగ్యానికి గురైన ప్రాథనా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు బిటుపన్ ఆమె ఇంటికి చేరుకున్నాడు. గుండెలవిసేలా ఏడ్చాడు. జీవితాంతం కలిసి నడవాలనుకున్న తన ప్రేయసిని చూసి తట్టుకోలేకపోయాడు. కుటుంబ సభ్యుల ముందే ఆమె మృతదేహానికి తాళి కట్టాడు. ప్రాథన నుదిటిపై కుంకుమ బొట్టు పెట్టి, మెడలో దండ వేశాడు. ఇక జీవితంలో తాను ఎవరినీ పెళ్లి చేసుకోనంటూ ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బిటుపన్ ని ప్రశంసిస్తున్నారు.