శ్రావణమాసం మాసం మహిళలకు చాలా ప్రత్యేకమైన మాసం.. ఈ మాసంలో బంగారాన్ని కొనుగోలు చెయ్యాలని భావించేవారికి ధరలు నేడు షాక్ ఇస్తున్నాయి.. అంతర్జాతీయంగానే పసిడి ధరలు పెరుగుతుండడంతో దేశీయ మార్కెట్లోనూ రేట్లు పెరుగుతున్నాయి. క్రితం రోజు గోల్డ్ రేటు తగ్గినట్లే తగ్గి ఇవాళ మరోసారి షాక్ ఇచ్చింది. అయితే, వెండి మాత్రం వరుసగా రెండో రోజు పడిపోయి కాస్త ఊరట కలిగించింది..తులం బంగారంపై ఏకంగా రూ. 170 వరకు పెరగడం గమనార్హం. దీంతో తగ్గిన దాని కంటే ఈరోజు పెరిగిన ధర ఎక్కువ కావడం గమనార్హం.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..
*. చెన్నైలో ఆదివారం 22 క్యారెట్స్ తులం గోల్డ్ ధర రూ. 55,550కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 60,490గా ఉంది.
*. ముంబయిలో 22 క్యారెట్స్ బంగారం రూ. 55,200కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,220 వద్ద కొనసాగుతోంది.
*. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్స్ ధర రూ. 55,350కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,370గా ఉంది.
*. బెంగళూరులో 22 క్యారెట్స్ ధర రూ. 55,200, 24 క్యారెట్స్ ధర రూ. 60,220 వద్ద కొనసాగుతోంది..
*. హైదరాబాద్‌లో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,200గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,220 వద్ద కొనసాగుతోంది..
బంగారం ధరలు పెరిగితే, వెండి మాత్రం తగ్గింది.. ఈరోజు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయాంటే..కిలో వెండి పై ఏకంగా రూ. 200 వరకు తగ్గడం విశేషం. చెన్నైలో ఆదివారం కిలో వెండి ధర రూ. 80,000గా నమోదైంది. అలాగే ముంబయిలో రూ. 76,900, ఢిల్లీలో 76,900వద్ద కొనసాగుతోంది.. అలాగే హైదరాబాద్ లో ఆదివారం కిలో వెండి ధర రూ. 80,000గా నమోదైంది..