Today Gold Price in Hyderabad on 2024 February 18: గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోయిన బంగారం ధరలు ఈ మధ్య కాలంలో కాస్త శాంతించాయి. పసిడి ధరల్లో పెద్దగా తగ్గుదల కనిపించకపోయినా.. పెరుగుదలకు మాత్రం అడ్డుకట్ట పడింది. అయితే వరుసగా రెండు రోజులు పెరిగిన బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో ఆదివారం (ఫిబ్రవరి 18) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,200గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,400గా ఉంది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.62,550గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200గా.. 24 క్యారెట్ల ధర రూ.62,400గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,800 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.63,050గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.62,400గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,200గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,400గా ఉంది.
Also Read: Tamannaah : ఎయిర్ పోర్ట్ లో తళుక్కున మెరిసిన తమన్నా.. వైరల్ అవుతున్న పిక్స్..
మరోవైపు వెండి ధరలు కూడా నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో నేడు కిలో వెండి ధర రూ.76,500లుగా కొనసాగుతోంది. నేడు ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,500గా ఉండగా.. ముంబైలో రూ.76,500 ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.78,000 కాగా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో రూ.78,000లుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.73,000గా ఉంది.