Gold Rate Today in Hyderabad: కేంద్ర బడ్జెట్ 2024 పుణ్యమా అని బంగారం ధరలు తగ్గాయని ఆనందించే లోపే.. కొనుగోలు దారుల ఆశలు ఆవిరయ్యాయి. పసిడి రేట్స్ మళ్లీ పరుగులు పెడుతున్నాయి. వరుసగా మూడు రోజులుగా పెరిగిన బంగారం ధరలు.. శనివారం కాస్త శాంతించాయి. ఇక గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (ఆగష్టు 5) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.64,700లుగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,580గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయాయవాడ, విశాఖపట్నంలలో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,700లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,580గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,850 పలకగా.. 24 క్యారెట్ల ధర రూ.70,730గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.70,580గా నమోదైంది.
Also Read: Payal Rajput-Prabhas: ప్రభాస్‌తో పెళ్లి.. నిజమైతే బాగుండు అనుకున్నా: పాయల్
మరోవైపు ఇటీవలి రోజుల్లో తగ్గుతూ వచ్చిన వెండి ధర మరలా పెరుగుతోంది. సోమవారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.200 పెరిగి.. రూ.85,700గా ఉంది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.91,000గా నమోదైంది. ఈ ఆరు రోజుల్లో కిలో వెండిపై రూ.1200 పెరిగింది.