బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిత్యం మారుతుంటాయి. రేట్స్ ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, డాలర్ విలువ లాంటివి ధరలను ప్రభావితం చేస్తాయి. అయితే గత కొన్ని రోజులుగా గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. ఇటీవలి రోజుల్లో తగ్గుతూ పెరుగుతున్నాయి. నేడు గోల్డ్ ప్రియులకు షాక్ ఇస్తూ భారీగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.430 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (డిసెంబర్ 3) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,300 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.77,780గా ఉంది.
మరోవైపు ఇటీవలి రోజుల్లో వెండి ధరల్లో పెద్దగా మార్పులు లేవు. గత కొన్ని రోజులుగా స్థిరంగా లేదా తగ్గుతూ వస్తోంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.91,000గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.99,500గా ఉంది. అత్యల్పంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో రూ.91,000గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,300
విజయవాడ – రూ.71,300
ఢిల్లీ – రూ.71,450
చెన్నై – రూ.71,300
బెంగళూరు – రూ.71,300
ముంబై – రూ.71,300
కోల్‌కతా – రూ.71,300
కేరళ – రూ.71,300
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,780
విజయవాడ – రూ.77,780
ఢిల్లీ – రూ.78,930
చెన్నై – రూ.77,780
బెంగళూరు – రూ.77,780
ముంబై – రూ.77,780
కోల్‌కతా – రూ.77,780
కేరళ – రూ.77,780
Also Read: Parliament Session 2024: ప్రతిష్టంభనకు తెర.. నేటి నుంచి సజావుగా పార్లమెంట్ ఉభయసభలు!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.99,500
విజయవాడ – రూ.91,000
ఢిల్లీ – రూ.91,000
ముంబై – రూ.91,000
చెన్నై – రూ.99,500
కోల్‌కతా – రూ.91,000
బెంగళూరు – రూ.91,000
కేరళ – రూ.99,500