Site icon NTV Telugu

Silver Rates: మళ్లీ షాకిచ్చిన సిల్వర్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

Gold

Gold

సిల్వర్ ధర మళ్లీ షాకిచ్చింది. కనుమ రోజున తగ్గినట్టే తగ్గి ఈరోజు మళ్లీ ఝలక్ ఇచ్చింది. ఏ మాత్రం దూకుడు తగ్గడం లేదు. ఇటీవలే 3 లక్షల మార్కు దాటిన వెండి ధర.. మరో రికార్డ్ దిశగా దూసుకెళ్లోంది. ఇవాళ కిలో వెండిపై రూ.3, 000 పెరిగింది. ఇక తులం గోల్డ్‌పై రూ. 380 పెరిగింది. దీంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు.

ఇది కూడా చదవండి: BMC Election Results: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి? పూర్తి రిపోర్టు ఇదే..

తులం గోల్డ్‌పై రూ.380 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,780 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.350 పెరగడంతో రూ.1,31,800 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.290 పెరిగి రూ.1,07,840 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Israel: వెస్ట్ బ్యాంక్‌లో కూలిన ఇజ్రాయెల్ హెలికాప్టర్.. వీడియో వైరల్

ఇక కిలో వెండిపై రూ.3,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,95, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్‌, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.3,10,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,95, 000 దగ్గర అమ్ముడవుతోంది.

Exit mobile version