NTV Telugu Site icon

Gold Rate : బంగారం కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ధర

Diwali Gold Sales

Diwali Gold Sales

Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి షాక్.. రేటు ఏకంగా ఏడు నెలల గరిష్టానికి చేరింది. ఇది పెళ్లిళ్ల సీజన్లో గోల్డ్ కావాలనుకునే వారికి భారీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అంతర్జాతీయంగా నెలకొన్న తీవ్ర అనిశ్చిత పరిస్థితుల వేళ ధరలు అందనంత ఎత్తుకు చేరిపోతున్నాయి. ఈ ఒక్క రోజులోనే బంగారం ధర రూ.750లు పెరిగింది. దీంతో ఈ నెలలో ఇదే గరిష్ట పెంపుగా భావించొచ్చు. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.48 వేలుగా ఉంది. నేడు అది రూ.48 వేల 750కి చేరింది. ఈ నెలలో ఇదే గరిష్ట విలువ కావడంతో పాటు.. గత 7 నెలలుగా చూసినా ఇదే అత్యధిక రేటు. చివరిసారి ఏప్రిల్ లో తులం బంగారం ధర రూ.49 వేల మార్కుదాటింది. ఆ తర్వాత ఇదే అత్యధికం. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.820 మేర పెరిగి రూ.53 వేల 180కి చేరింది.

Read Also: Crime : సభ్య సమాజం తలవంచుకునే ఘటన.. ఆరేళ్లుగా బాలికపై తండ్రి, తాత, అంకుల్ అత్యాచారం

వెండి విషయానికి వస్తే రేటు ఈ రోజు తగ్గింది. ఏకంగా రూ.1300 మేర పతనమైంది. దీంతో హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.67 వేల200కు చేరింది. నిన్న రూ.68 వేల500 వద్ద ఉంది. అంతకుముందు 5 రోజుల్లో వరుసగా వెండి ధర రూ. 2600 మేర పెరిగింది. అటు దేశ రాజధాని ఢిల్లీలో సైతం వెండి ధరలు తక్కువగానే ఉంటాయి. అక్కడ కిలో సిల్వర్ రూ.62 వేలు మాత్రమే ఉంది. ఇక 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.48 వేల 900 వద్ద ఉంది. అంతర్జాతీయంగా చూస్తే స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1764 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 21 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఇక రూపాయి పతనం మళ్లీ కొనసాగుతోంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.68 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల రూ.83 లెవెల్స్‌కు చేరిన నేపథ్యంలో మరోసారి ఆ విలువకు వెళ్తుందేమోననే ఆందోళనలు నెలకొన్నాయి.

Show comments