Site icon NTV Telugu

Gold &Silver Rates: ఈ శుక్రవారం బంగారం, వెండి షాక్.. భారీగా పెరిగిన ధరలు

Gold And Silver

Gold And Silver

ఓ వైపు యుద్ధ భయాలు, మరోవైపు చమురు చమురు సంక్షోభం ఆందోళనల నేపథ్యంలో బంగారం వెండి ధరలు కొనుగోలుదారులకు షాకిచ్చాయి. ఈ శుక్రవారం రోజున ధరలు భారీగా పెరిగాయి. నిన్న కాస్త తగ్గి ఊరటనిచ్చిన పసిడి, సిల్వర్ ధరలు మరింత పైకి ఎగబాకాయి. ఇవాళ తులం పుత్తడిపై రూ. 1520 పెరిగింది. కిలో వెండిపై రూ. 5000 పెరిగింది. ఈ రోజు హైదరాబాద్ నగరంలో 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.15,300, అదేవిధంగా 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.14,025 గాను, 1 గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర రూ.11,475 వద్ద అమ్ముడవుతోంది.

Also Read:Chain Snatching: చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి.. అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1520 పెరిగి రూ.1,53,000 వద్ద అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1400 పెరిగి రూ.1,40,250 కి చేరుకుంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,140 పెరగడంతో రూ.1,14,750 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,53,150 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,400 వద్ద సేల్ అవుతోంది.

Also Read:Gold Price Trends: బంగారం ధరల విషయంలో ఏం జరుగుతోంది? చైనా, మరో చిన్న దేశం సైలెంట్‌ గేమ్‌..!

ఈరోజు కిలో వెండిపై రూ.5,000 పెరిగింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,65, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఢిల్లీ కిలో వెండి ధర రూ.2,60, 000 దగ్గర ట్రేడవుతోంది.

Exit mobile version