దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతున్నాయి. సోమవారం స్థిరంగా ఉన్న ధరల్లో మంగళవారం స్వల్ప పెరుగుదల నమోదైంది. తాజాగా 10 గ్రాముల బంగారంపై 100 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 నుంచి రూ.47,750కి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980 నుంచి రూ.52,080కి చేరింది. బంగారం ధరలు పెరిగేందుకు పలు అంశాలు ప్రభావితం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరో వైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,080 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,080 ఉంది.
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.47,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,110 ఉంది.
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,190 వద్ద ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,080 వద్ద ఉంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,110 వద్ద ఉంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010 ఉంది.
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,110 వద్ద ఉంది.
వెండి ధరలు ఇలా..: దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర ఇలా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,000 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.66,300 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.66,300 ఉండగా, చెన్నైలో రూ.66,300 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.61,100 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.66,300 ఉంది. ఇక కేరళలో రూ.66,300 వద్ద కొనసాగుతోంది.