గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్. దీపావళి పండగ ముందు గోల్డ్ రేట్స్ తగ్గాయి. గత రెండు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు నిన్న స్థిరంగా ఉండగా.. ఈరోజు మాత్రం భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (అక్టోబర్ 28) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.450 తగ్గి.. రూ.73,150గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.490 తగ్గి.. రూ.79,800గా కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధరలు గత మూడు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.98,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి లక్షా ఏడు వేలుగా నమోదైంది. అత్యల్పంగా బెంగళూరులో 97 వేలుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,150
విజయవాడ – రూ.73,150
ఢిల్లీ – రూ.73,300
చెన్నై – రూ.73,150
బెంగళూరు – రూ.73,150
ముంబై – రూ.73,150
కోల్‌కతా – రూ.73,150
కేరళ – రూ.73,150
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.79,800
విజయవాడ – రూ.79,800
ఢిల్లీ – రూ.79,950
చెన్నై – రూ.79,800
బెంగళూరు – రూ.79,800
ముంబై – రూ.79,800
కోల్‌కతా – రూ.79,800
కేరళ – రూ.79,800
Also Read: IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్.. మరోసారి మూడు మార్పులతో భారత్!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,07,000
విజయవాడ – రూ.1,07,000
ఢిల్లీ – రూ.98,000
ముంబై – రూ.98,000
చెన్నై – రూ.1,07,000
కోల్‌కతా – రూ.98,000
బెంగళూరు – రూ.97,000
కేరళ – రూ.1,07,000