Gold Rates Down: పసిడి ప్రియులకు భారీ శుభవార్త.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొంతకాలంగా ఆకాశాన్ని తాకుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ వచ్చిన పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో పసిడి ప్రియులకు, కొనుగోలుదారులకు పెద్ద ఊరట లభించింది. బులియన్ మార్కెట్లో చోటుచేసుకున్న తాజా పరిణామాల కారణంగా బంగారం, వెండి రేట్లు భారీగా పతనమయ్యాయి.
ప్రస్తుత మార్కెట్ వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములపై ఏకంగా రూ.1,700 తగ్గి రూ.1,44,380 వద్దకు చేరింది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1,550 తగ్గి రూ.1,32,350 వద్దకు చేరుకుంది. పసిడి బాటలోనే పయనించిన వెండి ధరలు కూడా భారీగా క్రాష్ అయ్యాయి. కేవలం ఒక్క రోజులోనే కిలో వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గడంతో దాని ధర రూ.2.25 లక్షల మార్కు వద్దకు పడిపోయింది.
Also Read
- Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన సోనియాగాంధీ.. ఫస్ట్ పోస్ట్ ఏం చేశారంటే..!
- WTC Points Table: సౌతాఫ్రికాతో టెస్ట్ ఓడినా నంబర్-1 స్థానంలోనే ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా, భారత్ స్థానాలు ఎంతంటే..
- Dhanush: హస్తినలో హీరో ధనుష్ మకాం.. కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక మంతనాలు
- Biggest Cyber Robbery: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. కేవలం 87 నిమిషాల్లో రూ. 3.34 కోట్లు లూటీ..
ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు..
గత ఆగస్టు నెలలో అంతర్జాతీయ ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్‌ల తీవ్రత, డిమాండ్ పెరుగుదల వల్ల 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఆల్-టైమ్ గరిష్ట స్థాయి అయిన దాదాపు రూ.1.63 లక్షల వరకు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు ముగింపు నుంచి అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న తీవ్ర మార్పులు ఈ సడన్ పతనానికి కారణమయ్యాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానంలో మార్పులు, బాండ్ ఈల్డ్స్ హెచ్చుతగ్గులు, డాలర్ బలపడటం వల్ల పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను మళ్లించి ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. దీనికి తోడు రాబోయే పండగల సీజన్, వివాహాల సీజన్‌కు ముందు మార్కెట్లో చోటుచేసుకున్న ఈ కరెక్షన్ కొనుగోలుదారులకు అనుకూలమైన అవకాశంగా నిలిచింది. త్వరలో రానున్న ధన్తేరస్, దీపావళి పండగల వేళ బంగారం డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున ప్రస్తుతం తగ్గిన ఈ ధరలు కొనుగోలుకు సరైన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Gold Rates Down: పసిడి ప్రియులకు భారీ శుభవార్త.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..
-
Rashmika Mandanna: జాన్వీలా బట్టల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రష్మిక షాకింగ్ ఆన్సర్
-
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన సోనియాగాంధీ.. ఫస్ట్ పోస్ట్ ఏం చేశారంటే..!
-
WTC Points Table: సౌతాఫ్రికాతో టెస్ట్ ఓడినా నంబర్-1 స్థానంలోనే ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా, భారత్ స్థానాలు ఎంతంటే..
-
Dhanush: హస్తినలో హీరో ధనుష్ మకాం.. కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక మంతనాలు
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!