NTV Telugu Site icon

Godavari River : దోబూచులాదుతున్న గోదావరి

Godavari River

Godavari River

ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి వరద దోబూచులాడుతుంది. మూడు రోజుల నుంచి గోదావరి వరద పెరిగి మళ్ళీ తగ్గటం ప్రారంభించింది. గత మూడు రోజుల నుంచి గోదావరి పరివాహక ప్రాంతంలో వరద వచ్చి చేరుతోంది. గోదావరి కి అయితే గత ఏడాది వచ్చినటువంటి వరద మాత్రం రావడం లేదు. ఇప్పుడు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.4 అడుగుల వద్ద ఉన్నది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మూడు రోజుల క్రితం 43 అడుగులకు చేరుకున్న గోదావరి మళ్లీ 39 అడుగులకు తగ్గింది. కానీ గత రాత్రి నుంచి మళ్లీ గోదావరి పెరగటం ప్రారంభించింది. నిన్న సాయంత్రం నుంచి స్వల్పంగా పెరుగుతూ వచ్చిన తెల్లవారుజామున 6 గంటల వరకు గోదావరి 43. 6 అడుగుల వరకు చేరుకుంది.

Also Read : Biggest Cemetery : ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానవాటిక.. ఎక్కడో తెలుసా?

అయితే మళ్లీ అంతలోనే గోదావరి తగ్గుదల ప్రారంభమైంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి రెండు పాయింట్లు తగ్గి 43.4 అడుగులకు చేరుకుంది. ఎగువన పేరూరు వద్ద కూడా గోదావరి తగ్గటం ప్రారంభమైంది. అయితే ఎగువన భారీ వరద అయితే ఉన్నది ఆ వరద రావడానికి సమయం పడుతుంది. దిగువన పోలవరం వద్ద కూడా ఇదే దోబూచులాట కొన సాగుతుంది .పోలవరం వద్ద పెరుగుతూ తగ్గుతూ మళ్లీ పెరుగుతూ తగ్గుతూ వస్తున్నది భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 8 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా అదేవిధంగా పోలవరం వద్ద దిగువకి ధవలేశ్వరం వైపు ఆరున్నర లక్షలకు పైగా వెళ్తుంది అయితే దిగువన ఉన్న శబరి నది వేగంగా స్పీడ్ గా లేకపోవడంతో భద్రాచలం వద్ద వరదంతా కూడా సాఫీగా దిగువకు వెళ్ళిపోతుంది. 9,51,560 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతుంది. అయితే ఇప్పటికే భద్రాచలం వద్ద గత ఏడాది వచ్చిన వరదని దృష్టిలో పెట్టుకొని మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చిన వద్ద నుంచి అధికార యంత్రం అలర్ట్‌ గా ఉంది.

Also Read : Trains Cancelled: ఏపీ, తెలంగాణా రైలు ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు

మొదటి ప్రమాద హెచ్చరిక రాగానే భద్రాచలంలోని కొత్త కాలనీ చెందిన 90 మందిని కొనరావస కేంద్రాలకి తరలించారు . అయితే గతంలో రెండవ ప్రమాద హెచ్చరిక వచ్చిన తర్వాత పునరావస కేంద్రాలకు తరలించే అధికారులు ఇప్పుడు మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక దగ్గర నుంచి తరలించడం ప్రారంభించారు. ఇది ఎన్నికల ఏడాది కూడా కావడంతో అధికార యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం తగు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నట్లుగా స్పష్టం అవుతుంది. ఇప్పటికే పర్ణశాల వద్ద నార చీరలు మునిగిపోయాయి 36 అడుగులు వస్తే నార చీరల వద్ద కాలువ ఉప్పొంగుతుంది దాని ప్రభావంతో మునిగిపోవడం అనేది సహజంగానే జరుగుతుంది అయితే ఇప్పటివరకు భద్రాచలం పరివాహక ప్రాంతంలో రాకపోకలకు ఎక్కడా కూడా అంతరాయం ఏర్పడలేదు. మూడవ ప్రమాద హెచ్చరిక వస్తే ఆ స్థాయికి వరద వస్తే భద్రాచలం వద్ద ఎక్కువ ప్రాంతంలో ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితి కనిపించడం లేదు.