గోదావరి ఉధృతంగా ప్రవహించింది. మూడవ ప్రమాద హెచ్చరిక 55 అడుగులు దాటి ప్రవహించింది. అయితే గత తెల్లవారుజాము నుంచి గోదావరి శాంతించింది భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుతూ ఉంది. ఎగువన ప్రాజెక్టులు అన్నిట్లో నీళ్లు తగ్గిపోవటతో భద్రాచలం వద్ద కూడా నీటి ఉధృతి తగ్గింది. అయితే గోదావరి తగ్గు తుండడం తో గోదావరి చేసిన నష్టం ఇప్పుడిప్పుడే బయట పడుతుంది .ప్రధానంగా రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనపడుతుంది.
Also Read : Road Accident: మార్నింగ్ వాకింగ్కు వెళ్లి.. అనంత లోకాలకు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లో రోడ్లు దాదాపుగా అర కిలోమీటర్ మేరకు దెబ్బతిన్నాయి .ప్రధానమైన రోడ్డు సగభాగం కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. భద్రాచలం నుంచి బూర్గంపాడు మీదుగా కూనవరం రాజమండ్రి వెళ్లే ప్రధానమైన రహదారి కోతకి గురైంది. ఇది తెలంగాణ ప్రాంతంలో అయితే అదే విధంగా ఆంధ్ర ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది విఆర్ పురం, చింతూరు, కూనవరం అనేక మండలాల్లో గోదావరి ప్రళయం సృష్టించింది రోడ్లన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు.
Also Read : Andhra Pradesh: తల్లి ప్రేమంటే ఇదే.. వరదలో చిక్కుకున్న తన పిల్లల కోసం తల్లి కుక్క ఏం చేసిందంటే..!