గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ ఎన్ఎఫ్‌సి నగర్ వద్ద పట్టాలు తప్పింది. దీంతో.. ఐదు కోచ్ లకు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ కు స్టేషన్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎస్-4 నుంచి మొత్తం ఐదు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. అయితే.. పట్టాలపై నుంచి కోచ్‌లు పక్కకు ఒరిగాయి. దీంతో.. సంఘటన స్థలానికి హుటాహుటిన రైల్వే ఉన్నతాధికారులు బయలుదేరారు. అయితే.. గంటకు 100 కి.మీ. స్పీడ్‌తో వెళ్తుండగా.. ఒక్కసారిగా రైలు పట్టాలు తప్పడంతో ట్రైన్‌లో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికుల గాయాలైనట్లు సమాచారం. అయితే.. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బీబీనగర్ రైల్వేస్టేషన్‌లో విశాఖపట్నం – మహబూబ్ నగర్ స్పెషల్ ట్రైన్ నిలిచిపోయింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read : Joe Biden: ఇదో చారిత్రక ఒప్పందం.. ఎయిరిండియా-బోయింగ్ డీల్‌పై జో బైడెన్
ఇదిలా ఉంటే.. గత నెల 17న ఏపీలో జరిగిన రైలు ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. విశాఖ నుంచి కిరండోల్‌కు వెళ్తున్న ప్యాసింజర్ రైలులో ఒక భోగి అనంతగిరి మండలం కాశీపట్నం సమీపంలో పట్టాలు తప్పింది. అప్రమత్తమైన డ్రైవర్ రైలు ను వెంటనే నిలిపివేసి అధికారులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న సాంకేతిక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభించారు.
Also Read : Bhatti Vikramarka: కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే.. తెలంగాణ ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుంది