NTV Telugu Site icon

Dowleswaram Barrage: ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి ఉధృతి

Godavari

Godavari

Dowleswaram Barrage: గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. ముఖ్యంగా తూగో జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర క్రమేపి గోదావరి వరద నీటిమట్టం పెరిగిపోతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద ఉధృతి ఉంది. బ్యారేజీ వద్ద 10.50 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది. బ్యారేజ్ నుంచి 8 లక్షల 18 వేల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల అవుతున్నాయి. బ్యారేజ్‌కు చెందిన 175 గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటిని నేరుగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. సముద్రంలోకి విడుదల చేసే గోదావరి మిగులు జలాలు 10 లక్షలకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.

Read Also: Suicide: భార్య రొయ్యల కూర వండలేదని భర్త ఆత్మహత్య