Harish Rao : ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి నీటిని మూడు దశల్లో బనకచర్ల వరకు తరలించేందుకు కేంద్రానికి PFR సమర్పించడాన్ని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు ప్రకారం, ఈ ప్రాజెక్టును కేంద్రం ఇంకా ఆమోదించకముందే ఏపీ యూనిలేటరల్‌గా ముందుకు వెళ్లడం రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని, నదీజలాల బోర్డు నిబంధనలను ఉల్లంఘించడం. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జూన్ 13న కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసి దీనిని వ్యతిరేకించినందుకు హరీష్ రావు ఆయనను అభినందించారు.
8 Vasantalu Trailer : 8 వసంతాలు ట్రైలర్.. అమ్మాయి ప్రేమ లోతు..
హరీష్ రావు లేఖలో పేర్కొన్న విధంగా, తెలంగాణ రాష్ట్రానికి గోదావరి జలాల్లో 969 టీఎంసీల వాటా ఉండగా, ఇప్పటివరకు 600 టీఎంసీల వినియోగం జరిగింది. కానీ కాళేశ్వరం ఎత్తిపోతల అదనపు నివేదిక, సమ్మక్కసాగర్, వార్ధా ప్రాజెక్టుల DPRలు ఇంకా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పోలవరం ద్వారా 80 టీఎంసీలను కృష్ణా డెల్టాకు తరలించినట్లయితే, గోదావరి ట్రిబ్యునల్ Annexure C ప్రకారం, తెలంగాణకు అదనంగా 157.5 టీఎంసీలు లభించాల్సిన హక్కు ఉందని హరీష్ రావు గుర్తుచేశారు. ఈ జలాలను SLBC, కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు, డిండి వంటి పాత ప్రాజెక్టులకు వినియోగించే అవకాశం కలుగుతుంది.
ఇటీవల ISRWD చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ పరిధిని విస్తరించడంలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయం కూడా ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో వేసిన కేసుతో పాటు కేంద్రంతో చేసిన పదేళ్ల పోరాటం ఫలితంగా ఇప్పుడు 157.5 టీఎంసీల అదనపు వాటా కోసం వాదించే అవకాశం లభించిందన్నారు. తెలంగాణ నీటి హక్కులపై కేంద్రం ముందు గట్టిగా వాదించాల్సిన అవసరం ఉందని హరీష్ రావు సూచించారు. ఏపీ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలన్న డిమాండ్‌ను మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ద్వారా ముందుకు తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Israel Iran War: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం.. కొడుకు పెళ్లి వాయిదా వేసిన ప్రధాని..
