Site icon NTV Telugu

Goat Eye: బలి కోసం తెచ్చిన మేక కన్ను.. మనిషిని చంపింది.. ఎలానో తెలిస్తే బిత్తరపోతారు

Goat

Goat

Goat Eye: ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో మేకను బలి ఇచ్చిన తర్వాత, దాని కన్ను ఒక వ్యక్తిని చంపింది. విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఈ ఉదంతం ప్రసిద్ధ ఖోపా ధామ్‌లో జరిగింది. అక్కడ మేకను బలి ఇచ్చిన తర్వాత తింటారు. ఈ సమయంలో మేక కన్ను కారణంగా గ్రామస్థుడు మరణించాడు. ఈ ఘటనపై జనాలు రకరకాలుగా మాట్లాడుకోవడం ఆ ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారింది. సూరజ్‌పూర్ జిల్లా పర్రీ గ్రామంలో ఉన్న ఖోపా ధామ్‌లో కొంతమంది గ్రామస్థులు మేకను బలి ఇచ్చారు. బలి తర్వాత మేక మాంసాన్ని వండి పంచిపెట్టారు. ఇంతలో యాగం చేసిన గ్రామస్థుల్లో ఒకరైన బగర్ సాయి మాంసంలో వండిన మేక కంటిని తిన్నాడు. ఆ కన్ను సాయి గొంతులో ఇరుక్కుపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. మిగిలిన గ్రామస్తులు అతన్ని వెంటనే జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు చికిత్స చేసినప్పటికీ అతని ప్రాణాలను రక్షించలేదు.

Read Also:Priyanka Jawalkar : కిల్లింగ్ లుక్స్ తో మతి పోగొడుతున్న ప్రియాంక..

మృతుడు బగర్ సాయి రామానుజ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్‌పూర్ గ్రామానికి చెందినవాడు. బగర్ సాయి తన తోటి గ్రామస్థులతో కలిసి మేకను బలి ఇవ్వడానికి ఖోపా ధామ్‌కు వెళ్ళాడు. మేకను బలి ఇచ్చిన తరువాత, వారందరూ మాంసాన్ని అక్కడే ఉడికించి తినాలని నిర్ణయించుకున్నారు. మాంసం తింటున్న సమయంలో మేక కన్ను సాయి గొంతులో ఇరుక్కుపోయి మృతి చెందింది. ఈ ఘటనపై ఆ ప్రాంతంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. గ్రామస్తులు దీనిని దేవుడి ఆగ్రహంగా పేర్కొంటున్నారు. మేక బలి ఆమోదం పొందలేదని అందుకే ఇలాంటి ఘటన జరిగిందని అంటున్నారు. అంతే కాకుండా ఆ ప్రాంతంలో అనేక రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Read Also:Wimbledon Officials: ఈ గదిలో శృంగారం చేయొద్దు.. వింబుల్డన్ ఆటగాళ్లకు వార్నింగ్

Exit mobile version