NTV Telugu Site icon

Goa Hit And Run Case: రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీ కొట్టిన ట్రక్.. కిలోమీటర్ అవతల తల..

Goa

Goa

Goa Hit And Run Case: గోవాలోని పోండాలో హిట్ అండ్ రన్ ఘటన వెలుగులోకి వచ్చింది. పర్- ఖండేపర్ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిని 10 చక్రాల ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి శరీరం రెండు ముక్కలుగా విరిగిపోయింది. మృతుడి తల కిలోమీటరు దూరంలో లభ్యమైందని పోలీసులు తెలిపారు. తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన విషయం డ్రైవర్‌కు తెలియదని పోలీసు అధికారులు చెబుతున్నారు. మృతుడి తల లారీ టైర్లలో ఇరుక్కుపోవడంతోనే అంత దూరం వెళ్లే అవకాశం ఉందన్నారు.

Read Also: MLA Danam Nagender: మల్లారెడ్డితో సహా 20 మంది కాంగ్రెస్ లోకి.. దానం కీలక వ్యాఖ్యలు..

కాగా, మృతుడి తల ధాత్వాడ- ఉస్గావ్ రోడ్డులోని ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ సమీపంలో లభ్యమైంది. ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసు అధికారులు చెప్పడంతో లారీ డ్రైవర్‌కు విషయం తెలిసింది. వాస్తవానికి, అతను సంఘటన స్థలం నుంచి ముందుకు వెళ్లి ఉస్గావ్ రబ్బర్ ఫ్యాక్టరీ లోపల వెహికిల్ ను నిలిపాడు. ఘటనా స్థలంలో ఉన్న ప్రజలు తమ కళ్లతో ప్రమాదాన్ని చూశామని పోలీసులకు చెప్పారు. వేగంగా వచ్చిన ట్రక్కు పాదచారులపై నుంచి దూసుకెళ్లిందన్నారు. ఆ సమయంలో ఆ వ్యక్తి రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడి పై నుంచి ట్రక్ వెళ్లిందన్నారు.

Read Also: OPPO F27 Pro Plus 5G Price: మొదలైన సేల్.. ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్‌పై భారీ డిస్కౌంట్!

అయితే, మృతుడు ఆనంద్ ధరమ్ నాయక్‌గా పోలీసులు గుర్తించారు. ఈతడు పోండా నివాసిగా గుర్తించారు. తొలుత ఇది హిట్ అండ్ రన్ కేసుగా పోలీసు అధికారులు ఫైల్ చేశారు. సంఘటనా స్థలంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాగా.. అందులో ట్రక్కు రబ్బరు ఫ్యాక్టరీలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించింది. నిందితుడు ట్రక్ డ్రైవర్‌ను ధన్నానాథ్ జోగిగా గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి స్వస్థలం రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లా నివాసిగా గుర్తించిన పోలీసులు లారీని సీజ్ చేశారు.