Global Peace Honors 2026: ముంబైలోని ‘గేట్‌వే ఆఫ్ ఇండియా’ వేదికగా నవంబర్ 21న గ్లోబల్ పీస్ హానర్స్ 2026 వేడుక ఘనంగా జరిగింది. దివ్యజ్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి సినీ, క్రీడా, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, విక్రాంత్ మాస్సే తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో షారుఖ్ ఖాన్ చేసిన ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మానవత్వం, వినయం, సామాన్యుల శక్తి గురించి ఆయన మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన ప్రాధాన్యత ఉందని, మానవత్వమే అన్నింటికంటే గొప్పదని ఆయన సందేశమిచ్చారు. దీంతో ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకున్నారు. ఈ వేడుకలో సద్గురుకు పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కృషికి గాను గౌరవం లభించింది. ముఖ్యంగా సేవ్ సాయిల్ ఉద్యమం ద్వారా ఆయన చేస్తున్న ప్రయత్నాలను గుర్తించారు.
ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు కూడా ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆయన ఫౌండేషన్ ద్వారా నిరుపేద పిల్లల విద్య, ఆరోగ్యం, క్రీడలు, వారి కలలను సాకారం చేసేందుకు చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా నటుడు రణ్‌వీర్ సింగ్ వేదికపై సచిన్‌కు భావోద్వేగపూరిత నివాళి అర్పించారు. సచిన్ బ్యాటింగ్ చేసేటప్పుడు మ్యాచ్‌లో ఏం జరిగినా ఆయన క్రీజులో ఉండాలని కోట్లాది మంది అభిమానులు కోరుకునేవారని గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ పిల్లల భవిష్యత్తు కోసం సచిన్ మరో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నారని కొనియాడారు.
Absolute Frame 🖼️ https://t.co/L50zLptiij
— POSITIVE FAN (@imashishsrrk) November 21, 2026
మరోవైపు, 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడుల బాధితులకు అమితాబ్ బచ్చన్ ప్రత్యేక వీడియో సందేశం ద్వారా నివాళులర్పించారు. ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులు, అమాయక ప్రజలను స్మరించుకున్నారు. అలాగే నటుడు టైగర్ ష్రాఫ్ తన డ్యాన్స్ ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. అక్టోబర్‌లో ఆయన వాహనంపై కాల్పులు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన ఘటన తర్వాత తొలిసారిగా బహిరంగ వేదికపై ప్రదర్శన ఇచ్చారు. ‘దేవా శ్రీ గణేశా’ పాటకు ఆయన చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలో కొన్ని సరదా సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. షారుఖ్ ఖాన్ ప్రసంగిస్తున్న సమయంలో అనంత్ అంబానీ సరదాగా ఆయనను మౌనంగా ఉండమంటూ సైగ చేయడం అక్కడున్న వారిలో నవ్వులు పూయించింది.
#WATCH | Mumbai, MH: Actor Ranveer Singh honours and celebrates cricket legend Sachin Tendulkar on stage during ‘Global Peace Honours 2026’ at the Gateway of India. https://t.co/fBYiBbM5Nm
— ANI (@ANI) November 21, 2026
Anant Ambani shows a finger to Shahrukh Khan, visibly asking him to be quiet while he was speaking to Sadhguru. https://t.co/HZTpQ7ZAQb
— Treeni (@treeni) November 21, 2026
bruh what is Anant Ambani telling Shah Rukh Khan about Ranveer Singh 😭😭😭 https://t.co/UUg2bPffYh
— sohom (@AwaaraHoon) November 21, 2026

