Site icon NTV Telugu

Tamil Nadu: ప్రియుడి కోసం పెళ్లి మండపంలో దొంగతనం చేసిన లవర్..

Tamil Nadu

Tamil Nadu

ప్రియుడు కోసం పెళ్లి మండపంలో ప్రియురాలు దొంగతనం చేసింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి లో ఘటన చోటు చేసుకుంది.. ప్రియుడి అవసరాల కోసం ఓ పెళ్లి మండపంలో 21 సవరాల నగలను ప్రియురాలు జ్యోతి దొంగతనం చేసింది.. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా ప్రియుడు, ప్రియురాలితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడు అప్పును తీర్చడానికి, జల్సాల కోసం దొంగతనం చేసినట్టుగా పోలీసులు విచారణలో వెల్లడైంది.

READ MORE: YS Jagan: మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కడికి సినిమా చూపిస్తా..! జగన్‌ మాస్‌ వార్నింగ్..

నేటి కలియుగంలో లవర్ కోసం మహిళలు ఎంతకైనా తెగిస్తున్నారు. కట్టుకున్న భర్తను సైతం మట్టుబెట్టడానికి కూడా వెనకాడటం లేదు. ప్రియుడి కోసం భర్తను ప్లాన్ ప్రకారం అంతమొందించిన అనేక ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. దేశంలోని పలు రాష్ట్రల్లో ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ వార్త విన్న తర్వాత.. ప్రియుడి కోసం మర్డర్లు సైతం చేసే లవర్‌లకు దొంగతనం చేయడం ఓ లేక్కా? అని నెటిజన్లు అంటున్నారు.

READ MORE: Israel Iran War: ‘‘ప్రపంచం పెను విపత్తు ముందుంది’’.. ఇజ్రాయిల్-ఇరాన్ ఘర్షణపై రష్యా..

Exit mobile version