ప్రియుడు కోసం పెళ్లి మండపంలో ప్రియురాలు దొంగతనం చేసింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి లో ఘటన చోటు చేసుకుంది.. ప్రియుడి అవసరాల కోసం ఓ పెళ్లి మండపంలో 21 సవరాల నగలను ప్రియురాలు జ్యోతి దొంగతనం చేసింది.. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా ప్రియుడు, ప్రియురాలితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడు అప్పును తీర్చడానికి, జల్సాల కోసం దొంగతనం చేసినట్టుగా పోలీసులు విచారణలో వెల్లడైంది.