Bihar: బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ.. 300 అడుగుల లోతైన లోయలోకి జంప్.. ఆ తర్వాత ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: బీహార్‌లోని నలందలో 300 అడుగుల ఎత్తైన కొండ ప్రాంతం నుంచి ఓ మైనర్ బాలిక లోయలోకి దూకింది. ఆ యువతి తన ప్రియుడితో గొడవపడి ఆత్మహత్య చేసుకునేందుకు కొండపై నుంచి దూకింది. దూకడంతో ఆమె పొదలో కూరుకుపోయింది. పొదల్లో కూరుకుపోయిన బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆరుగురు వ్యక్తులు ఆ యువతిని పొదల్లో నుంచి బయటకు తీసి బీహార్ షరీఫ్‌లోని సదర్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించింది. క్రిటికల్ గా ఆమెను పావపురి మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు.
Read Also:Bigg Boss Telugu 7: హౌస్లోకి గౌతమ్ రీ ఎంట్రీ…వస్తూనే శివాజీకి షాక్..
Also Read
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ఆ అమ్మాయి నలంద జిల్లాలోని రాహుయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటోంది. ఆమె ఓ యువకుడితో కలిసి హిరణ్య పర్వతానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ అబ్బాయి ఆమె ప్రేమికుడిగా చెబుతున్నారు. ఇద్దరూ గుడి వెనుక కూర్చుని మాట్లాడుకుంటున్నారు. దీని తరువాత ఏదో విషయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆపై అమ్మాయి హిరణ్య పర్వతం నుండి దూకింది. యువతి ఒక్క సారిగా దూకడంతో భయంతో యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు.
Read Also:Kancharla Bhupal Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ.. గ్రామంలో అడుగుపెట్టకుండానే..!
యువతి అరుపులు విన్న ప్రజలు కింద పొదల్లో చిక్కుకున్న ఆమెను చూశారు. ఇంతలో అక్కడున్న వారు డయల్ 112కి కాల్ చేశారు. పోలీసులు రాకముందే ఆరుగురు వ్యక్తులు 45 నిమిషాల పాటు శ్రమించి ఆమెను పొదల్లో నుంచి బయటకు తీసి పైకి తీసుకొచ్చారు. బాలిక అపస్మారక స్థితికి చేరుకుందని చెబుతున్నారు. ఇంతలో పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక ప్రజల సహాయంతో ఆమెను సదర్ ఆసుపత్రి బీహార్ షరీఫ్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాలికను పావాపురికి రిఫర్ చేశారు. ఈ విషయమై ఇంతవరకు ఎవరూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు.
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..