NTV Telugu Site icon

Ginger – Tomato Price: అల్లం ధర ఆకాశాన్నంటుతుంది.. టమాట టెక్ చూపిస్తోంది

Ginger Tomato Price

Ginger Tomato Price

Ginger – Tomato Price: ఉత్తర భారతంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల టమాటా పంట దెబ్బతినగా, మరోవైపు అల్లం రైతులు మాత్రం పంటను నిలిపివేసి గత ఏడాది నష్టాలను పూడ్చుకునేందుకు ధరలు పెంచుతున్నారు. టొమాటో మరోసారి తన విశ్వ రూపాన్ని చూపించడం ప్రారంభించింది. గత పక్షం రోజులుగా టమాటా, అల్లం ధరలు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి.

ఇదిలా ఉండగా పుచ్చకాయ విత్తనాల ధర మూడు రెట్లు పెరిగింది. వాస్తవానికి పుచ్చకాయ గింజలను మనం ఎక్కువగా సూడాన్ నుండి దిగుమతి చేసుకుంటాం. ప్రస్తుతం అక్కడ సైనిక వివాదం నడుస్తోంది. దీంతో దిగుమతులు పడిపోయాయి. సూడాన్ వివాదానికి ముందు కిలో పుచ్చకాయ విత్తనాల ధర రూ.300ఉండగా.. ప్రస్తుతం మూడురేట్లు పెరిగి రూ.900లకు చేరిందని ఢిల్లీకి చెందిన సంజయ్ శర్మ అనే వ్యాపారి తెలిపాడు.

Read Also:Kakani Govardhan Reddy: రైతు అసలైన శాస్త్రవేత్త.. రైతు మాత్రమే ప్రయోగాలు చేయడానికి అర్హుడు

రెట్టింపైన టమాటా ధర
15 రోజుల క్రితం రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.40 ఉన్న టమాటా ధరలు ప్రస్తుతం కిలో రూ.80కి పెరిగాయి. ఆజాద్‌పూర్ మార్కెట్‌లోని టమాటా ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కౌశిక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆజాద్‌పూర్ మండి (ఢిల్లీ)లో వర్షం కారణంగా పంట దెబ్బతినడంతో టమోటాల సరఫరా తగ్గింది. కొత్త పంట వచ్చేంత వరకు ధరలు ఇలాగే ఉండబోతున్నాయి. దక్షిణ భారతదేశం నుండి టమోటాలకు విపరీతమైన డిమాండ్ ఉందని, దాని కారణంగా ధరలు పెరుగుతున్నాయని కౌశిక్ చెప్పారు. ప్రస్తుతం హర్యానా, యూపీ ప్రాంతాల నుంచి టమోటాలు వస్తున్నాయన్నారు. కనీసం రెండు నెలల పాటు ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది.

రాకెట్ కంటే వేగంగా అల్లం ధర
100 గ్రాములు రూ.30 ఉన్న అల్లం ధర ఇప్పుడు రూ.40కి పెరిగింది. గత ఏడాది గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోవాల్సి వచ్చిందని అఖిల భారత కూరగాయల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు శ్రీరామ్‌ గధ్వే చెబుతున్నారు. ఈసారి మార్కెట్‌లో జాగ్రత్తగా పంటను పండిస్తున్నారు. ఇప్పుడు ధరలు పెరగడంతో తమ పంటలను అమ్ముకోనున్నారు. భారతదేశ వార్షిక అల్లం ఉత్పత్తి దాదాపు 2.12 మిలియన్ మెట్రిక్ టన్నులు.

Read Also:Train Accident: 48 గంటలు నరకయాతన.. పొదల్లో సజీవంగా రైలు ప్రమాద బాధితుడు